Begin typing your search above and press return to search.

కొత్త కొత్త‌గా క‌మ‌ల‌ ద‌ళం: అన్ని రాష్ట్రాల‌కు ప్రాధాన్యం

బీజేపీ కేంద్ర క‌మిటీని తాజాగా ప్ర‌క్షాళ‌న చేశారు. అన్ని రాష్ట్రాల‌కు దాదాపు ఈ క‌మిటీలో స్థానం క‌ల్పించారు. త‌ద్వారా జాతీయ స్థాయిలో కొత్త వ్యూహాల‌ను అనుస‌రించేదిశ‌గా బీజేపీ అడుగులు వేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

By:  Garuda Media   |   18 Aug 2026 6:00 AM IST
కొత్త కొత్త‌గా క‌మ‌ల‌ ద‌ళం:  అన్ని రాష్ట్రాల‌కు ప్రాధాన్యం
X

బీజేపీ కేంద్ర క‌మిటీని తాజాగా ప్ర‌క్షాళ‌న చేశారు. అన్ని రాష్ట్రాల‌కు దాదాపు ఈ క‌మిటీలో స్థానం క‌ల్పించారు. త‌ద్వారా జాతీయ స్థాయిలో కొత్త వ్యూహాల‌ను అనుస‌రించేదిశ‌గా బీజేపీ అడుగులు వేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా గ‌తంలో ద‌క్షిణాదికి ప్రాధాన్యం ద‌క్క‌క పోవ‌డం.. ఇప్పుడు ఈ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కీల‌క రోల్ క‌ల్పించ‌డం వంటివి రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రాన్ని ఏవిధంగా బీజేపీ హ్యాండిల్ చేయ‌నున్నద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌.. సార‌థ్యంలో బీజేపీకి కొత్త టీమ్‌ను ఏర్పాటు చేస్తూ.. తాజాగా పార్టీ ప్ర‌క్షాళ‌న చేశారు. దీనిలో జాతీయ వైస్ ప్రెసిడెంట్లుగా బీజేపీ 13 మందిని నియ‌మించింది. అందులోనూ.. 12 రాష్ట్రాల‌కు చెందిన వారు ఉండ‌డం గ‌మ నార్హం. అందునా.. క‌ర్ణాట‌క‌, ఏపీల‌కు ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం మ‌రింత విశేష‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జాతీయ వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్న వారు దాదాపు ఉత్త‌రాది రాష్ట్రాల‌కు చెందిన వారే ఉండ‌డం.. ఇప్పుడు స‌మూల మార్పుల్లో ద‌క్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎన్నిక‌ల వ్యూహాన్ని స్ప‌ష్టం చే్స్తోంది.

వీరే నేష‌న‌ల్ వైస్ ప్రెసిడెంట్స్‌

1) ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి(ఏపీ)

2) ఎం. నాగ‌రాజ‌(క‌ర్ణాట‌క‌)

3) తీర్థ‌సింగ్ రావ‌త్‌(ఉత్త‌రాఖండ్‌)

4) వ‌సుంధ‌ర రాజే(రాజ‌స్థాన్‌)

5) రామ్ మాధ‌వ్‌(ఏపీ)

6) బైజయంత్‌ జయ్‌ పాండా(ఒడిశా)

7) రేఖా వర్మ(గుజ‌రాత్‌)

8) నరేంద్రభాయ్ జోషీ(గుజరాత్‌)

9) భారతీ ప్రవీణ్‌ పవార్‌(మహారాష్ట్ర)

10) మన్‌ప్రీత్‌ సింగ్‌బాదల్‌(పంజాబ్‌)

11) లాల్‌ సింగ్‌ ఆర్య(మధ్యప్రదేశ్‌)

12) తారిఖ్‌ మన్సూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)

13) మధుచంద్ర కర్‌(పశ్చిమబెంగాల్‌)

వ్యూహం ఇదే!

త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌ల్పించారు. దేశంలో మ‌హిళా ఓట‌ర్లు పెరుగుతున్న నేప‌థ్యంలో వారికి ప్రాతినిధ్యం క‌ల్పించ‌డం ద్వారా మ‌హిళా ఓట్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే దిశ‌గా క‌మ‌ల నాథులు అడుగులు వేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే.. ద‌క్షిణాదికి ద‌క్కిన కీల‌క ప‌ద‌వుల‌తో పోల్చుకుంటే.. వివిధ `మోర్చా`ల‌కు మాత్రం ఉత్త‌రాది నాయ‌కుల‌కే ప్రాధాన్యం ఇచ్చారు. త‌ద్వారా.. ఆయా రంగాల్లో వారు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అడుగులు వేశారు.