Begin typing your search above and press return to search.

బీజేపీ జాతీయ‌ సార‌థ్యం ఆయ‌నకేనా?.. 20న ఎన్నిక‌!

బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ఈ నెల 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను పార్టీ తాజాగా విడుద‌ల చేసింది.

By:  Garuda Media   |   17 Jan 2026 10:00 AM IST
బీజేపీ జాతీయ‌ సార‌థ్యం ఆయ‌నకేనా?.. 20న ఎన్నిక‌!
X

బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ఈ నెల 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను పార్టీ తాజాగా విడుద‌ల చేసింది. ఈ నెల 19న మ‌ధ్యాహ్నం 2-4 గంట‌ల మ‌ధ్య‌ నామినేష‌న్ల‌ను తీసుకుంటారు. దీనికి ఎవ‌రైనా స‌రే.. బీజేపీ నాయ‌కులు పోటీచేయొచ్చు. అయితే.. ఇది సాధార‌ణంగా చేసిన ప్ర‌క‌ట‌న‌. కానీ, వాస్త‌వానికి ఇప్ప‌టికే పార్టీ పెద్ద‌లు.. బీజేపీ జాతీయ సార‌థిని ఎంపిక చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి గ‌త ఏడాది బీజేసీ జాతీయ సార‌థ్యంపై చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఎంపీ పురందేశ్వ‌రి స‌హా.. త‌మిళ‌నాడు బీజేపీ నాయ‌కురాలి పేర్లు ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌చ్చాయి. అయి తే.. అప్ప‌ట్లో బీహార్ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఈ ప్ర‌క్రియ‌ను వాయిదా వేశారు. ఇక‌, తాజాగా బీజేపీ సార‌థిని ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను పార్టీ చేప‌ట్టింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 19న నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. దీనికి రిట‌ర్నింగ్ అధికారిగా తెలంగాణ‌కు చెందిన ఎంపీ ల‌క్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

నామినేష‌న్ల‌ను స్వీక‌రించిన అనంత‌రం.. పోటీలో ఒక‌రికి మించి ఎక్కువ మంది ఉంటే.. ఎన్నిక నిర్వహించే అవ‌కాశం ఉంటుంది. కానీ.. వాస్త‌వానికి ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడూ రాలేదు. సో.. ఇప్పుడు కూడా ఏకైక నామినేష‌నే దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, మ‌రుస‌టిరోజు అంటే.. ఈ నెల 20న బీజేపీ సార‌థిని ప్ర‌క‌టించ‌నున్నారు. దీంతో ప్ర‌ధాన క్ర‌తువు పూర్తి కానుం ది. ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జేపీ న‌డ్డా రెండు సార్లు బీజేపీ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు.

ముందే నిర్ణ‌యం!

ఇక‌, బీజేపీ జాతీయ ప‌గ్గాల‌ను బీహార్‌కు చెందిన మంత్రి, నితిన్ న‌బీన్‌కే అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది డిసెంబ‌రు లో అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు పార్టీలోనే లేని ప‌ద‌వి.. `కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు`ని సృష్టించి.. న‌బీన్‌కు అవ‌కాశం ఇచ్చారు. వాస్త‌వానికి బీహార్ ఎన్నిక‌ల స‌మ‌యంలో నితీష్‌కుమార్‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి హామీ క‌నుక ఇవ్వ‌క‌పోతే.. న‌బీన్‌కే సీఎం పోస్టు ద‌క్కి ఉండేది. ఈయ‌న కేంద్ర మంత్రి అమిత్ షాకు అత్యంత స‌న్నిహితుడు.పైగా ఆర్ ఎస్ ఎస్ వాది కూడా. ఈ నేప‌థ్యంలో న‌బీన్‌నే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎంపిక చేసే అవ‌కాశంఉంద‌ని తెలుస్తోంది.