సిద్ధాంతం అంటే ఇదేనా.. బీజేపీపై ట్రోల్స్ రీజనేంటి?
ఎందుకంటే.. చిన్న ఎన్నికే కాబట్టి.. పెద్దగా ఖర్చు కూడా ఉండదు కాబట్టి.. ప్రజల అభిప్రాయాన్ని మరోసా రి కోరేవారు.
By: Garuda Media | 17 Feb 2026 9:30 AM ISTరాజకీయాల్లో వైరం అంటే.. తాటాకు చప్పుడేనని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా.. మీరు-మీరు దోస్తులు అంటూ.. నిత్యం కాంగ్రెస్-బీఆర్ ఎస్ పార్టీలపై విమర్శల తూటాలు పేల్చే బీజేపీ.. అవసరం రాగానే.. ఆ విమర్శలను తూచ్ అనేసి.. తానే పోయి పోయి.. ఆ రెండు పార్టీలతో చేతులు కలిపింది. తాజాగా జరిగిన తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 36 మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి ప్రజలు మద్దతు తెలపలేదు. దీంతో వాస్తవానికి.. ఇలాంటి సందర్భాల్లో గతంలో మరోసారి ఎన్నికలు నిర్వహించే వారు.
ఎందుకంటే.. చిన్న ఎన్నికే కాబట్టి.. పెద్దగా ఖర్చు కూడా ఉండదు కాబట్టి.. ప్రజల అభిప్రాయాన్ని మరోసా రి కోరేవారు. కానీ.. ఇప్పుడు ఒక్కసారి ఎన్నికలు నిర్వహిస్తేనే ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, రాద్ధాంతాలను పక్కన పెట్టి.. ఇలా హంగ్ ఏర్పడిన చోట చేతులు కలిపేశారు కమలనాథులు. నిత్యం తిట్టిపోసే కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలతో కమల నాథులు కలిసిపోయి.. ఐదు చోట్ల పాగా వేశారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు.. ట్రోల్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లోనూ హంగ్ ఏర్పడితే.. ఇలానే ప్రభుత్వాన్ని కూడా పంచుకునేందుకు సిద్ధమా? మీ సిద్ధాంతాలు ఎన్నికల రాజకీయం కోసమేనా? అంటూ.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకపై బీఆర్ ఎస్-కాంగ్రెస్ పొత్తు అంటూ.. వ్యాఖ్యలు చేసే దమ్ము ఉందా? అని కొందరు నిలదీశారు. మరికొందరు.. మహారాష్ట్రలోనూ ఇలానే కలిసిపోయిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అక్కడ కూడా.. బీజేపీ-కాంగ్రెస్‌కలిసి ఒక కార్పొరేషన్‌ను దక్కించుకున్నాయని.. రాజకీయాల్లో పైకి ఎన్ని చెప్పినా.. అధికారం కోసం ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు.
ఇవే.. బీఆర్ ఎస్-కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ దక్కించుకున్న మునిసిపాలిటీలు
1) ఆమన్‌గల్: కాంగ్రెస్+బీజేపీ కలిసి మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి.
2) నర్సాపూర్: కాంగ్రెస్+బీజేపీ కలిసి మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి.
3) అలియాబాద్: కాంగ్రెస్+బీజేపీ కలిసి మునిసిపాలిటీలో పాగా వేశాయి. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి.
4) ఎల్లంపేట: బీఆర్ ఎస్+ బీజేపీ కలిసి మునిసిపాలిటీలో పాగా.. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి.
5) జిన్నారం: బీఆర్ ఎస్+ బీజేపీ కలిసి మునిసిపాలిటీలో తిష్ఠ. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి.
