Begin typing your search above and press return to search.

టీడీపీతో అసలు కుదరంటున్న బీజేపీ !

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు నో చెబుతోంది. ఎక్కడా ఏమిటీ అంటేనే మ్యాటర్ పొలిటికల్ గా వేరే అని అర్థం చేసుకోవాలి.

By:  Satya P   |   3 Aug 2025 11:25 PM IST
టీడీపీతో అసలు కుదరంటున్న బీజేపీ !
X

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు నో చెబుతోంది. ఎక్కడా ఏమిటీ అంటేనే మ్యాటర్ పొలిటికల్ గా వేరే అని అర్థం చేసుకోవాలి. ఏపీలో చూస్తే టీడీపీ పెద్దన్నగా ఉంది. బీజేపీ జనసేన వచ్చి చేరాయి. మూడు పార్టీలు కలసి కూటమి కట్టాయి. దాంతో బ్రహ్మాడమైన మెజారిటీ వచ్చింది. దివ్యంగా ప్రభుత్వం ఏర్పాడింది. కలసి ఉంటే కలదు సుఖం అనుకుంటూ ముందుకు సాగుతున్నాయి మిత్రపక్షాలు. కానీ తెలంగాణాలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది.

తెలంగాణాలో మాత్రం ఎందుకో :

తెలంగాణాలో బీజేపీ ఇపుడు రాజకీయంగా అవకాశాలు పెంచుకోవాలని చూస్తోంది. ఒక వైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి చరిష్మాటిక్ లీడర్ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు ఇక బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది పదేళ్ళ పాటు తెలంగాణాను ఏలిన పార్టీగా బీఆర్ఎస్ ఉంది. పైగా కేసీఆర్ ఉద్యమకారుడిగా ఉన్నారు. తెలంగాణ మలి విడత పోరాటాన్ని విజయం వైపుగా నడిపిన క్రెడిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు అలా బీఅర్ఎస్ కి ఇంధనం ఇమేజ్ అన్నీ కేసీఆర్ అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఈ మధ్యలో బీజేపీ ఉంది. బీజేపీ జాతీయ స్థాయిలో బలంగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ఎందుకో ఎత్తిగిల్లలేకపోతోంది. పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఉండడం కూడా బీజేపీకి ఇబ్బందిగానే ఉన్నట్లుంది దాంతో అందరినీ కలుపుకుని పోయే విధంగా బీజేపీ దృఢమైన నాయకత్వంతోనే ముందుకు సాగాల్సి ఉంది.

పొత్తుకు బీజేపీ నో :

ఇక బీజేపీకి పట్టణ ప్రాంతాలలో బలం ఉంది. రూరల్ బేస్ లో కమలానికి ఆదరణ తక్కువ అన్నది కూడా ఒక విశ్లేషణ గా ఉంది. టీడీపీ తెలంగాణాలో ఈ రోజుకీ కొన్ని ప్యాకెట్స్ లో కొంత ప్రభావం చూపించే స్థితిలో ఉంది. అలా బీజేపీ టీడీపీ జనసేనలకు కలుపుకుని ఎన్డీయే కూటమిగా ముందుకు సాగితే అధికారం దక్కుతుంది అన్న లెక్కలు ఉన్నాయి. అయితే ఈ రకమైన రాజకీయ సమీకరణ వల్ల తెలంగాణా వాదం ముందుకు వచ్చి అసలుకే ఎసరు వస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. దాంతో టీడీపీతో పొత్తులు నో అని బీజేపీ చెబుతోంది.

ఒంటరిగానేనని క్లారిటీ :

తెలంగాణాలో టీడీపీతో కానీ జనసీనతో కానీ పొత్తులకు ఆస్కారం లేదని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా చెప్పారు. ఏపీలో రాజకీయం వేరు అక్కడ పరిస్థితులు వేరు, కానీ తెలంగాణా రాజకీయం వేరు పరిస్థితులు వేరు అని ఆయన అంటున్నారు. తెలంగాణాలో బీజేపీ ఈ కారణంగానే పొత్తుల వైపు చూడటం లేదని సొంతంగా పోటీకి సిద్దపడుతోందని ఆయన వివరిస్తున్నారు.

ఏపీకి మాత్రమే ఎన్డీయే :

దీంతో ఏపీకి మాత్రమే ఎన్డీయే పరిమితం అని పక్కా క్లారిటీని అయితే బీజేపీ ఇచ్చేసింది. నిజానికి డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ నినదిస్తుంది. ఎక్కడ అయినా పార్టీలు ఉంటే కలుపుకుని పోతుంది. కానీ తెలంగాణాలో మాత్రం టీడీపీని వద్దు అనేస్తోంది. అలా కనుక పొత్తు కూడితే బీఆర్ఎస్ కి రాజకీయ ఆయుధంగా మారుతుందని ఏపీకి చెందిన పార్టీతో పొత్తులని బీజేపీని మరింతగా రాజకీయ చెలగాటం ఆడుకుంటారని కలవరపడుతోంది అంటున్నారు. అందువల్లనే టీడీపీని దూరం పెడుతోంది అంటున్నారు. అయితే ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న చర్చ ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ పొత్తుల ఎత్తులలో ముందు ముందు నిర్ణయాలు ఏమైనా మారుతాయామో చూడాలి.