బీజేపీ హిస్టరీలో యంగెస్ట్ లీడర్
భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాందీ ప్రస్థావన జరుగుతోంది.
By: Satya P | 15 Jan 2026 12:30 PM ISTభారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాందీ ప్రస్థావన జరుగుతోంది. బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. తొలి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్ పేయ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆ పదవికి చేపట్టే నాటికి ఆయన ఏజ్ 55 ఏళ్ళు, ఇక ఆయన తరువాత బీజేపీకి తరువాత సారధ్యం 1986లో ఎల్ కే అద్వానీ వహించారు. అప్పటికి ఆయన వయసు 59 ఏళ్ళు. ఇక బీజేపీకి మురళీ మనోహర్ జోషీ, కుశభవ్ ఠాకూర్, బంగారు లక్ష్మణ్, జనా క్రిష్ణమూర్తి, ఎం వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు నాయకత్వం వహించారు. వీరంతా సుమారుగా యాభై ఏళ్ళు పై దాటిన తరువాతనే ఈ కీలక పదవిని అందుకున్నారు.
ఫస్ట్ టైం ఆయన :
అయితే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితుడవుతున్న నితిన్ నబిన్ సిన్హా 46 ఏళ్ళ వారుగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే బీజేపీ హిస్టరీలో యంగెస్ట్ లీడర్ అన్న మాట. బీహార్ కి చెందిన నితిన్ నబిన్ సిన్హా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డిసెంబర్ 14న ఆయనను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.
అంతా లాంచనప్రాయంగా :
ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడి పదవి కోసం జరిగే ఎన్నికలో నామినేషన్ పర్వం ఈ నెల 19న ఉంటుంది. ఆ రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబిన్ తన పదవికి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయన పేరుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తరు. అట్టహాసంగా జరిగే ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీకి చెందిన ప్రముఖులు కేంద్ర మంత్రులు కీలక నేతలు అంతా హాజరవుతారు. ఇక ఆయన ఒక్కరిదే ఏకైక నామినేషన్ గా ఉండబోతోంది దాంతో ఆయన ఎన్నిక అయినట్లుగా ఈ నెల 20న అధికారికంగా ప్రకటిస్తారు.
బీహార్ నుంచి ఆయన :
బీహార్ నుంచి గతంలో ఎవరూ బీజేపీకి నాయకత్వం వహించలేదు, యూపీ, గుజరాత్, మహారాష్ట్ర ఏపీ, తమిళనాడు ఇలా అనేక మంది పార్టీ బాధ్యతలు చూశారు. మరి యువకుడు పార్టీకి బద్ధుడు అయిన నితిన్ నబిన్ సిన్హా బీజేపీ సారధ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారో చూడాల్సి ఉంది.
కీలక బాధ్యతలు :
కొత్త అధ్యక్షుడి మీదనే కీలక బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది మధ్యలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అంతే కాదు వచ్చే ఏడాది మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ఉంటే 2028లో కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ పోరు ఉంది. 2029లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష పదవిలో గత ఆరేళ్ళుగా జేపీ నడ్డా కుదురుకున్నారు. నితిన్ నబిన్ పదవీ కాలం కూడా 2029 ఎన్నికల దాకా ఉండొచ్చు అని అంటున్నారు. సో ఆయన విజయాలతో పాటు యూత్ ని పార్టీకి కనెక్ట్ చేయడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు.
