అధికారమే లక్ష్యంగా.. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలు.. బీజేపీ ప్లాన్ ఏంటి?
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తెలంగాణకు సునీల్ బన్సల్, కో-ఇన్‌ఛార్జులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, ఏపీకి అరవింద్ భదౌరియా, కో-ఇన్‌ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By: A.N.Kumar | 23 Sept 2026 9:00 PM ISTతెలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తెలంగాణకు సునీల్ బన్సల్, కో-ఇన్‌ఛార్జులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, ఏపీకి అరవింద్ భదౌరియా, కో-ఇన్‌ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఏపీ బీజేపీ ఎంపీ పురందీశ్వరిని, తమిళనాడు కో-ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్లను ప్రకటించింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడం.. ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ బాధ్యతలు సునీల్ భన్సల్‌కు..
తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా సునీల్ భన్సల్‌ను నియమించారు. సహ ఇన్‌చార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మకు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా అరవింద్ భదౌరియాను, సహ ఇన్‌చార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌ను నియమించారు. తమిళనాడు ఇన్‌చార్జ్‌గా రామ్ మాధవ్‌కు బాధ్యతలు అప్పగించగా.. డీకే అరుణ కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.
పలు రాష్ట్రాలకు కీలక నేతలు
ఒడిశా ఇన్‌చార్జ్‌గా పురంధేశ్వరి కొనసాగనుండగా.. కర్ణాటక కో-ఇన్‌చార్జ్‌గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక, బిహార్ ఇన్‌చార్జ్‌గా హరీశ్ ద్వివేది నియమితులయ్యారు. ఢిల్లీ బాధ్యతలను వినయ్ సహస్రబుద్ధేకు, గుజరాత్ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్‌కు, హిమాచల్‌ప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా శ్రీకాంత్ శర్మకు అప్పగించారు.
యూపీ, మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌చార్జ్‌గా వినోద్ తావ్డేను నియమించారు. మహారాష్ట్ర బాధ్యతలను బైజయంత్ పాండాకు అప్పగించారు. స్మృతి ఇరానీకి ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాల బాధ్యతలు కట్టబెట్టారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రాల వారీగా సంస్థాగత బలోపేతం, నాయకులు.. కార్యకర్తల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి ప్రచారంపై కొత్త ఇన్‌చార్జ్‌లు దృష్టి సారించనున్నారు. తాజా నియామకాలతో ఎన్నికల సమరానికి బీజేపీ అధిష్టానం తన సంస్థాగత యంత్రాంగాన్ని మరింత చురుకుగా సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా గెలుపుగుర్రాలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.
