ఆ ఓటు బ్యాంకుపై బీజేపీ దృష్టి ..!
ఏపీలో బీజేపీ పుంజుకోవాలి. బలమైన శక్తిగా కూడా ఎదగాలి. - ఇదీ.. జాతీయ బీజేపీ నాయకత్వం పెట్టుకు న్న లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు సాగాయి.
By: Garuda Media | 14 Dec 2025 5:00 PM ISTఏపీలో బీజేపీ పుంజుకోవాలి. బలమైన శక్తిగా కూడా ఎదగాలి. - ఇదీ.. జాతీయ బీజేపీ నాయకత్వం పెట్టుకు న్న లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు సాగాయి. కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటివారికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్ప గించారు. కానీ.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇక, ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గంతో కలుపుగోలు కోసం పురందేశ్వరికి కూడా పగ్గాలు అప్పగించారు.
కూటమి కట్టడంలోనూ.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకునే విషయంలోనూ ఆమెసక్సెస్ అయ్యారు. అయితే.. ఇది చాలదన్నది పార్టీ జాతీయ నాయకత్వం చెబుతున్నమాట. ఈ క్రమంలోనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కూటమిలో కలివిడిగా ఉంటూనే వ్యక్తిగతంగా పార్టీని డెవలప్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై రాష్ట్ర నాయకత్వం కూడా కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తటస్థ ఓటు బ్యాంకును చేరువ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం కులాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఓటు బ్యాంకు కొన్ని పార్టీలకు పరిమితం అయింది. వైసీ పీకి రెడ్డి ఓటు బ్యాంకు.. పదిలం అనుకున్నా.. కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎస్సీ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. భారీ కూటమి హవాలోనూ ఎస్సీనియోజకవర్గాల్లో వైసీపీ పట్టు సాధించింది. గెలిచినా గెలవకపోయి నా.. మెజారిటీ ఓట్లను దక్కించుకుంది.
ఇక, ఎస్టీ ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీకి అనుకూలంగానే ఉంది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా తటస్థ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో విద్యా వం తులు, మేధావులు...విద్యార్థి ఓటు బ్యాంకుపై దృష్టి పెడుతోంది. ఇది ఏ పార్టీకి ఇబ్బంది కరంగా మారుతుందనే చర్చ తెరమీదికి వస్తోంది. కూటమికూడా కొంత మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నా.. మెజారిటీగా వైసీపీ ఓటు బ్యాంకుకు పెద్ద ఎత్తున నష్టం వచ్చే ఛాన్స్ కనిపిస్తోందని చెబుతున్నారు. అదేసమయంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఏర్పడుతుందా? అంటే.. ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
