Begin typing your search above and press return to search.

అన్నదమ్ములు కలిసినా పాతికేళ్ల పట్టును కోల్పోయారు

థాక్రే ఫ్యామిలీ చేతుల్లో ఏకంగా రెండున్నర దశాబ్దాలుగా ఉన్న అతి పెద్ద కార్పోరేషన్ మీద ఈ రోజు కాషాయ జెండా ఎగిరింది.

By:  Satya P   |   17 Jan 2026 7:00 AM IST
అన్నదమ్ములు కలిసినా పాతికేళ్ల పట్టును కోల్పోయారు
X

థాక్రే ఫ్యామిలీ చేతుల్లో ఏకంగా రెండున్నర దశాబ్దాలుగా ఉన్న అతి పెద్ద కార్పోరేషన్ మీద ఈ రోజు కాషాయ జెండా ఎగిరింది. శివసేన రాష్ట్ర అధికారం చేజిక్కుకునే కంటే ముందు ముంబై కార్పోరేషన్ మీదనే పట్టు సాధించింది. అలా శివసేనకు సొంతం అన్నట్లుగా ఉన్న ఒక కీలక కార్పోరేషన్ ని బీజేపీ తన మిత్రులతో కలసి గెలుచుకోవడం అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ మలుపుగా చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే 2024 అక్టోబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కంటే కూడా ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేనకు ఇది అతి పెద్ద ఓటమిగా చెబుతున్నారు.

వైరం మరచి ఒక్కటైనా :

ఇక్కడ మరో రాజకీయ తమాషా గురించి కూడా చెప్పుకోవాలి. 2005 నుంచి ఠాక్రే బ్రదర్స్ వేరు అయ్యారు, ఎవరి దారి వారిదే అయింది. వేరు పార్టీ పెట్టుకు తమ్ముడు రాజ్ థాకరే బయటకు వెళ్ళారు, అదంతా బాల్ ఠాక్రే బతికి ఉండగానే జరిగింది. అంటే పెద్దాయన కూడా అన్నదమ్ముల మధ్య పొత్తు కుదర్చలేకపోయారు అన్న మాట. అలాంటిది బీజేపీ తన మిత్రులతో కలిసి శివసేన మీద చేస్తున్న రాజకీయ దండయాత్రకు జడిసి ఉద్ధవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ థాక్రేతో చేతులు కలిపేందుకు సైతం వెనకాడని పరిస్థితిని కల్పించింది. సరే ఇంత జరిగినా ఫలితం ఎలా ఉంది అంటే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు మరో చేదు ఓటమిని మిగిలించేలా రిజల్ట్ ఘాటుగా వచ్చింది.

ఫలితాలు షాకింగ్ :

ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే అధికార ఎన్డీయే కూటమికి పూర్తిగా అనుకూలంగా వచ్చాయి. అందులో కీలకమైనది ముంబై కార్పోరేషన్ బీజేపీ మిత్రులు కలసి గెలుచుకోవడం. బీజేపీ శివసేన షిండే మహాయుతి కూటమిగా ఏర్పడి ఒక హిస్టారికల్ విక్టరీని నమోదు చేశారు. దీంతో ముంబై కార్పోరేషన్ లో మొత్తం 116 స్థానాలు సాధించి అధికారాన్ని హస్తగతం చేసూన్నారు.

అతి పెద్ద విజయంగా :

ముంబై కార్పోరేషన్ దేశంలో అతి పెద్ద బడ్జెట్ సాగే కార్పొరేషన్ గా పేరు. దేశంలోని మూడు నాలుగు రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే కూడా ఇది అధికంగా ఉంటుంది. . దాదాపు రూ. 74,400 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ముంబై కార్పొరేషన్ బీజేపీ దాని మిత్రుల పరం అయింది. అలాంటి చోట థాక్రేల రాజకీయానికి బీజేపీ భారీ చెక్ పెట్టేసింది. ఈ కార్పోరేషన్ లో అధికారం అందుకోవాలీ అంటే మొత్తం 227 సీట్లకు గానూ 114 వస్తే చాలు, కానీ బీజేపీకి 116బ్ సీట్లు లభించాయి. అంటే క్లియర్ కట్ మెజారిటీని సాధించింది అన్న మాట. ఇక ఈ 116 లో బీజేపీకి సొంతంగా 88 సీట్లు దక్కితే షినే నాయకత్వంలోని శివసేనకు 28 దక్కాయి. ఇక ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు 74, రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనకు 8 సీట్లు దక్కాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 23, శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ మజ్లీస్ పార్టీలు అన్నీ కలిసి మరో ఆరు సీట్లు దక్కించుకున్నాయి.

మహా ప్రభంజనం :

అంతే కాకుండా మొత్తం మహారాష్ట్రలో జరిగిన మిగిలిన 28 మున్సిపల్ కార్పోరేషన్లలో కూడా బీజేపీ కూటమి మంచి విజయాలను నమోదు చేసింది. అంటే టోటల్ గా 29కి పైగా కార్పొరేషన్లలో 2,869 సీట్లు ఉంటే బీజేపీ కూటమి దాదాపుగా 1,517 సీట్లను దక్కించుకుంది. ఈ విధంగా చూస్తే అధికార సాధించిన ఏణ్ణర్థం కాలంలో స్థానిక ఎన్నికల్లో అదే విజయాన్ని నమోదు చేయడం బీజేపీ కూటమికి ఒక రికార్డుగా చెబుతున్నారు. ఒక మరో కీలకమైన మునిసిపల్ కార్పోరేషన్ పూణేలో సైతం బీజేపీ కూటమి ఆధిక్యం సాధించడం విశేషం. ఇక్కడ బాబాయ్ శరద్ పవార్, అబ్బాయ్ అజిత్ పవార్ కలిసి పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి చూస్తే చూస్తే మూడు దశాబ్దాల నుంచి ఉద్ధవ్ ఠాక్రే ఆధీనంలో ఉన్న ముంబై కార్పోరేషన్ బీజేపీ చేతుల్లోకి రావడం ఈ మొత్తం విజయాల్లో మేలి మలుపుగా చెబుతున్నారు.