బెంగాల్‌పై మోడీ స్ట్రాటజీ.. ఎన్నికలపై దిశానిర్దేశం!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
By: Garuda Media | 3 Dec 2025 10:00 PM ISTవచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే సంవత్సరం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయంగా, సంఖ్యా పరంగా కూడా ఈ మూడు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు.. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీకి కూడా ప్రాణప్రదంగా మారాయి. ఇక, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టు ప్రభావం ఉంది.
ఈ నేపథ్యంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ కీలకంగా భావిస్తోంది. తరచుగా ఆయా రాష్ట్రాలపై వ్యూహాలు మారుస్తూ .. రాజకీయంగా దూకుడు పెంచే విధంగా వ్యవహరిస్తోంది. తాజాగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పై దృష్టి పెట్టా రు. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలను చేరుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోవద్దని తేల్చి చెప్పారు. ముఖ్యంగా 2011లో కేవలం ముగ్గురితో మొదలైన ప్రస్థానం.. 2021 నాటికి 63కు చేరుకుంద న్నారు.
ఇదే పరంపర కొనసాగాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బెంగాల్ అధికార పక్ష(టీఎంసీ) నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దని సూచించారు. కాగా.. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఓటర్ల సమగ్ర రివిజన్ జరుగుతోంది. దీనికి కూడా బీజేపీ నాయకులు సహకరించా లని తెలిపారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడంతోపాటు.. రోహింగ్యా ముస్లింలు సహా.. ఇతర దేశాల నుంచి వచ్చిన చొరబాటు దార్లను జాబితాల నుంచితొలగించేలా బీజేపీ ఎంపీలు చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
