ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అపరకుబేరులు ఏం చదివారు?
చాలామందికి మస్క్ గురించి తెలుసు. ఆయన గురించి ఏదో ఒక వార్తాంశాన్ని చదివే పరిస్థితి.
By: Garuda Media | 2 Sept 2025 1:00 PM ISTప్రపంచాన్ని ప్రభావితం చేయటం అంత సులువైన అంశం కాదు. అది కూడా పెద్ద వయసు లేకుండానే.. ప్రపంచం మొత్తం తమ వైపు చూసేలా చేసుకోవటానికి ఎంత టాలెంట్ ఉండాలి? అలాంటి ఐదుగురు కుబేరుల చదువు సంధ్యలేమిటి? అత్యంత ప్రభావవంతులుగా.. ధనవంతులుగా అయ్యేందుకు చదువు సాయం చేస్తుందా? వ్యాపారకళ ఉంటే సరిపోతుందా? అన్నది ఒక ప్రశ్న.
టెస్లా.. స్సేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ కావొచ్చు.. ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్.. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్.. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్.. గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ ల విషయానికి వస్తే.. వారు ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారు ఏం చదివి ఉంటారు? అన్నది ప్రశ్న. మరి.. వారి చదువు సంధ్యలు వారి తాజా పరిస్థితికి ఎంతమేర కారణం అయ్యాయి? అన్నది మరో ప్రశ్న.
చాలామందికి మస్క్ గురించి తెలుసు. ఆయన గురించి ఏదో ఒక వార్తాంశాన్ని చదివే పరిస్థితి. మరి.. అంత సుపరిచితుడైన అతగాడు ఏం చదివాడు? అతడి ఎడ్యుకేష్ క్వాలిఫికేషన్ ఏమిటి? అన్న విషయాన్ని ప్రశ్నిస్తే.. అత్యధికులు ఆన్సర్ చెప్పలేరు. ఇంతకు మస్క్ ఏం చదివారు? అన్న విషయంలోకి వెళితే.. స్కూలింగ్ దక్షిణాఫ్రియాలోని ప్రిటోరియాలో పూర్తి చేస్తే.. బ్యాచిలర్ డిగ్రీని కెనడా.. పెన్సిల్వేనియాలో పూర్తి చేసవారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలోనూ.. పెన్సిల్వేనియా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిజిక్స్.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్ ఫర్డ్ వర్సిటీలో ఫిజిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు చేరినా.. అది మాత్రం పూర్తి చేయలేదని చెబుతారు. ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన చదువులోనూ భిన్నత్వాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది.
ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉంటారు. ఇతను అత్యంత తెలివైన వ్యక్తిగా ఎలాన్ మస్క్ సైతం కితాబు ఇవ్వటం గమనార్హం. అలాంటి ఆయన ఎల్లిసన్ చికాగో వర్సిటీలో చదివారు. కానీ.. డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు. వర్సిటీలో చేరిన వేళలో ఆయన తల్లి మరణించటంతో.. ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు. కానీ.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని యూత్ మొత్తం (దాదాపుగా) ఫాలో అయ్యే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలకు యజమాని జూకర్ బర్గ్. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్ లు ఆయన కంపెనీకి చెందినవే. హార్వర్డ్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ సైకాలజీ చదివిన ఆయన.. ఫేస్ బుక్ ను స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం డిగ్రీ పూర్తి చేయలేదు.
ప్రపంచ కుబేరుల్లోని టాప్10 జాబితాలో ఉన్న మరో వ్యక్తి అమెజాన్ వ్యవస్థాపకులుగా సుపరిచితులు జెఫ్ బెజోస్. ప్రిన్సటన్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఫిజిక్స్ చదవాలని భావించినా చదవలేకపోయారు. కంప్యూటర్ల మీద తనకున్న వ్యక్తిగత ఆసక్తితో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక.. గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ విషయానికి వస్తే.. ఆయన ప్రపంచ కుబేరుల్లో ఐదో ప్లేస్ లో ఉన్నారు. వీరు.. మిచిగాన్ వర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్ ఫర్డ్ వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ లోని పీహెచ్ డీ రీసెర్చ్ సమయంలో లారీ పేజ్ .. సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సెర్చ్ ఆల్గారిథంను డెవలప్ చేశారు. ఇది ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే.
