ఎలక్షన్ ముందు ‘డర్టీ పాలిటిక్స్’... నేతలకు ఎస్కార్ట్ అమ్మాయిలు?
అవును... తాజాగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బీహార్ లో "డర్టీ పాలిటిక్స్" నడుస్తున్నాయనే విషయం తెరపైకి వచ్చింది!
By: Raja Ch | 8 Nov 2025 7:49 PM ISTఇప్పటికే రాజకీయాల్లో డబ్బు, మందుతో కూడిన ప్రలోభాలు కీలక భూమిక పోషిస్తున్నాయని.. ఓటర్ల నుంచి నేతల వరకూ ఇవి కీలకంగా మారుతున్నాయని అంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందికి రాజకీయాలన్నా, నేతలన్నా ఓ రకమైన ఏహ్యభావం వచ్చేసిందనే చర్చా జరుగుతుంది! ఈ నేపథ్యంలో బీహార్ కేంద్రంగా ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది!
అవును... తాజాగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బీహార్ లో "డర్టీ పాలిటిక్స్" నడుస్తున్నాయనే విషయం తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా... ఎన్నికలకు ముందు కొంతమంది ఏజెంట్లు హైప్రొఫైల్, విదేశీ అమ్మాయిలను పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల ఇళ్లకు, హోటల్ గదులకు పంపుతున్నారని ఆ నివేదిక ఆరోపించింది!
ఈ వ్యవహారంలో సుమారు 100 మంది కంటే ఎక్కువమంది అమ్మాయిలు పాల్గొన్నారనే ప్రచారమూ జరుగుతుంది! వీరిలో ఎక్కువ మందిని ఢిల్లీ, బీహార్, జార్ఖాండ్, నేపాల్, యూపీ సరిహద్దుల మధ్య పనిచేసే నెట్ వర్క్స్ నుంచి తీసుకువస్తున్నారని నివేదిక పేర్కొన్న పరిస్థితి! దీంతో ఈ డర్టీ పాలిటిక్స్ స్ట్రింగ్ ఆపరేషన్ సంచలనంగా మారింది.
ఈ సీక్రెట్ ఆపరేషన్ లో ఓ కీలక పార్టీకి చెందిన కీలక నాయకురాలు తమతో మాట్లాడినట్లు నివేదిక వెళ్లడించింది! ఇందులో భాగంగా... తనకు నాయకుల అభిరుచి తెలుసని.. వాళ్లు గ్లామరస్ అమ్మాయిలను కోరుకుంటారని.. ఇందులో కొంతమంది సింగిల్ గా, మరికొంతమంది డబుల్ గా ఎంజాయ్ చేస్తారని.. మరికొన్ని సార్లు ఇదరు నాయకులు ఒకే అమ్మాయితో సంబంధం కొనసాగిస్తారని చెప్పినట్లు తెలిపింది!
ఈ విషయంలో ఉన్నత స్థాయి అమ్మాయిలతో ఆనందాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తమపై ఉంటుందని.. బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ కేంద్ర నాయకత్వం ఈ పెద్ద బాధ్యతను అప్పగించిందని ఆమె చెప్పుకొచ్చినట్లు సదరు మీడియా నివేదించింది! బీహార్ లో ఓ పెద్ద నెట్ వర్క్ ను దర్యాప్తు చేసిన తర్వాత తమ బృందం ఈ నాయకురాలికి టచ్ లోకి వెళ్లినట్లు నివేదిక వెల్లడించింది!
దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే రాజకీయాలపై కొంతమంది ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడిందని చెబుతోన్న వేళ.. ఇక నైతికత అనే మాటకు అర్ధం ఎక్కడుందనే చర్చా మొదలైందని అంటున్నారు.
ఏది ఏమైనా... దృఢమైన ఆధారాలు లభించే వరకూ ఈ వాదనలు, ఆరోపణలు, నివేదికలు "తుపాకీ.కామ్" ధృవీకరించదు కానీ... ఎన్నికల సమయంలో వినిపించే డబ్బు, మద్యం ప్రభావానికి ఇది అదనం అనే చర్చ మాత్రం మొదలైందనే చెప్పాలి!
