Begin typing your search above and press return to search.

బీహార్ లో ఓడితే ఫస్ట్ జంప్ అయ్యేది ఆయనేనట ?

బీహార్ ఒక రాష్ట్రం. అక్కడ అయిదేళ్ళకు ఒక మారు అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. ఆ విధంగా ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.

By:  Satya P   |   29 Aug 2025 4:00 AM IST
బీహార్ లో ఓడితే ఫస్ట్ జంప్ అయ్యేది ఆయనేనట ?
X

బీహార్ ఒక రాష్ట్రం. అక్కడ అయిదేళ్ళకు ఒక మారు అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. ఆ విధంగా ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇది సర్వ సాధారణమైన ప్రక్రియ. అయితే ఈసారి మాత్రం బీహార్ అలా లేదు. అక్కడ ఎన్నికలు దేశంలో పాలిస్తున్న్న కేంద్ర ప్రభుత్వం ఉనికికే ముప్పు తెచ్చేలా ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అదేమిటి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే దాని ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ఉంటుందా. ఏకంగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుందా అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతలా బీహార్ ఎన్నికల ఫలితాలు దేశాన్నే కుదిపేయబోతున్నాయని అంటున్నారు

నంబర్ గేమ్ పాలిటిక్స్ :

రాజకీయాలు గత కొన్ని దశాబ్దాలుగా నంబర్ గేమ్ గా మారిపోయాయి. ఇక్కడ నంబర్ ఎవరి వైపు ఉంటే వారిదే అధికారం. నంబర్ కి దేనితోనూ పనిలేదు. అటు నుంచి ఇటు వైపు ఎవరైనా జంప్ చేస్తే ఈ వైపు నంబర్ పెరుగుతుంది. సహజంగానే ఆధిక్యత వస్తుంది. దాంతో అధికార కేంద్రాలు కూడా ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు అందుకే బీహార్ ఎన్నికల మీద అంత ఫోకస్ ఉందని చెబుతున్నారు. బీహార్ ఎన్నికలలో ఎవరు ఓడేది ఎవరు గెలిచేది కనుక తెలుస్తే జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా దానిని బట్టి చెపవచ్చు అని అంటున్నారు.

ఎన్డీయే ఓడితే కనుక :

రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అన్న ప్రాధమిక సూత్రాన్ని అంతా నమ్ముతారు. అది వర్తమాన కాలం ఇంకా ఎక్కువగానే నమ్ముతారు. ఇక చూస్తే కనుక బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. జేడీయూకి చెందిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన నేత ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయిదేళ్ళుగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతకు ముందు అంటే 2019 ఎన్నికల కంటే ముందే నితీష్ కుమార్ ఎన్డీయేతో చేరారు ఆ విధంగా చూస్తే ఇంకా ఎక్కువ కాలమే ఎన్డీయే పాలన అక్కడ ఉంది అన్న మాట. అలాగే చూస్తే నితీష్ కుమార్ ఏకంగా పాతికేళ్ల పాటు సీఎం గా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలసి ప్రజా వ్యతిరేకత కనుక పెద్ద ఎత్తున వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఓడుతుందని విశ్లేషణలు ఉన్నాయి.

జోరు మీద ఇండియా కూటమి :

గత ఎన్నికల్లోనే ఎక్కువ సీట్లు ఇండియా కూటమి సాధించింది. వారికి వందకు పైగా ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే మెజారిటీ ఎన్డీయేకు ఉండడంతో అధికారం ఎన్డీయే కూటమికి దఖలు పడింది. ఈ నేపథ్యంలో ఈసారి జనాలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు. పైగా ఓటర్ అధికార యాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఆయన బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఎండ గడుతున్నారు. అలాగే లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ బలంగా ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు బాగా పుంజుకున్నాయి. దీంతో బీహార్ లో ఇండియా కూటమి గెలిస్తే ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది.

ఓడితే జంపింగ్ స్టార్ట్ :

ఇక తాజాగా చూస్తే కనుక బీహార్ లో ఎన్డీయే కొంత ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. నితీష్ కుమార్ రూపంలో పాత ముఖాన్ని సీఎం అభ్యర్థిగా ముందు పెట్టుకుని ఎన్డీయే ఎన్నికలకు వెళ్తోంది. అవతల వైపు చూస్తే ఆర్జేడీ నాయకుడు యువకుడు తేజస్వి యాదవ్ కొత్త ముఖంగా జనాలకు కనిపిస్తున్నారు. ఆయనకు ఈసారి చాన్స్ ఇద్దామని జనాలు ఒక అభిప్రాయానికి వస్తే కనుక ఎన్డీయేకు ఇబ్బంది తధ్యం. అలా ఎన్డీయే ఓడితే బీహార్ లో నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారు ఆయన గత పాతికేళ్ళుగా అధికారంలో లేకుండా ఖాళీగా అయితే లేరు. దాంతో ఆయన ఓటమి చెందితే మాత్రం ఎన్డీయేను వీడుతారు అన్న చర్చ అయితే ఉంది అంటున్నారు.

ఆ విషయంలో అంతేనా :

నితీష్ కుమార్ బీహార్ లో పాతికేళ్ళ పాటు సీఎం గా ఉండడానికి ఎన్నో సార్లు పార్టీలు మార్చారు. కూటములు మార్చారు ఆర్జేడీతో ఎన్నో సార్లు కలిశారు, విడిపోయారు, అంత వరకూ ఎందుకు 2020లో ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మధ్యలో ఇండియా కూటమి వైపు వెళ్ళారు. తిరిగి ఎన్డీయే వైపు వచ్చారు. ఇపుడు కూడా ఆయన మాజీ అయితే మాత్రం కచ్చితంగా ఇండియా కూటమి వైపు జంప్ చేస్తారు అని అంటున్నారు. దాంతో ఆయనకు చెందిన జేడీయూ పార్టీకి ఉన్న 12 మంది ఎంపీలు కూడా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉప సం హరించుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తే బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపేలా ఉన్నాయని అంటున్నారు.