Begin typing your search above and press return to search.

ఏపీకి వ‌రంగా మారిన బీహార్ విజ‌యం..!

బీహార్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యం ద‌క్కించుకుం ది.

By:  Garuda Media   |   15 Nov 2025 7:00 PM IST
ఏపీకి వ‌రంగా మారిన బీహార్ విజ‌యం..!
X

బీహార్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యం ద‌క్కించుకుం ది. మొత్తం 243 స్థానాల‌కు గాను 208 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఈవిజ‌యానికి ఏపీకి మ‌ధ్య లింకు ఉందా? అంటే.. ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే కూట‌మిపై గ‌త కొన్నాళ్లుగా నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీహార్ ఘ‌న విజ‌యం ఆ కూట‌మికి భారీగా క‌లిసివ‌చ్చింది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. డబుల్ ఇంజ‌న్ స‌ర్కారుతో ఏపీ దూసుకుపోతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతు న్నారు. మంత్రి నారా లోకేష్ మ‌రో అడుగు ముందుకు వేసి.. డ‌బుల్ ఇంజ‌న్ బుల్లెట్ ట్రైన్ స‌ర్కారు అంటున్నారు. ఈ క్ర‌మంలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఇప్పుడు బీహార్‌లోనూ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో ఏపీలో మ‌రింత‌గా బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు పుంజుకునే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే 2029 నాటికి వీరి మ‌ధ్య బంధం మ‌రింత పెరుగుతుంద‌న్న అవ‌కాశం కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.

బీహార్ విజ‌యాన్ని కేవ‌లం ఆ రాష్ట్రానికే ప‌రిమితం చేయ‌డానికి వీల్లేదు. దేశ‌వ్యాప్తంగా ఎన్డీయే కూట‌ములు ఉన్న ప్ర‌భుత్వాల‌కు కూడా అన్వ‌యించిన‌ప్పుడు.. ఆయా రాష్ట్రాల్లోని కూట‌మి ప్ర‌భుత్వాల‌కు ఈ విజ‌యం మ‌రింత ఆక్సిజ‌న్ అందిస్తుంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న‌మాట‌. ముఖ్యంగా త‌ట‌స్థ ఆలోచ‌న‌లు ఉ న్న ఏపీలో బీహార్ ఫ‌లితం మ‌రింత‌గా కూట‌మి నేత‌ల‌ను ఒక్క‌టి అయ్యేలా చేస్తుంద‌ని కూడా చెబుతున్నా రు. కూట‌మిగా ఉంటేనే విజ‌యం అని చంద్ర‌బాబు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు బీహార్‌లోనూ అదే కూట‌మి విజ‌యం సాకారం అయిన నేప‌థ్యంలో వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల నాటికి కూడా ఎన్డీయే కూట‌మి ఇదే విధంగా ముందుకు సాగుతుంద‌న్న అంచ‌నా వేస్తున్నారు. ఎన్డీయే కూట‌మికి బీహార్ ప్ర‌జ‌లు క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని అందించిన నేప‌థ్యంలో ఏపీలో ఆయా పార్టీలు మ‌రింత పుంజుకుంటాయ‌ని కూడా చెబుతున్నారు. ''ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి మాత్రం కూట‌మి మ‌రింత బ‌లోపేతం అవుతుంది'' అని బీజేపీకి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.