Begin typing your search above and press return to search.

నితీష్ కేబినెట్ లో సగం మందిపై క్రిమినల్ కేసులు

ఎన్డీయేలో బీజేపీ జేడీయూ ఎల్జేపీ హిందుస్థానీ అవామ్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. ఇక కేసుల విషయం వచ్చేసరికి అన్ని పార్టీల మంత్రుల మీద ఉన్నాయని ఏడీఆర్ ఆసకికరమైన నివేదికను వెల్లడించింది

By:  Satya P   |   24 Nov 2025 10:00 PM IST
నితీష్ కేబినెట్ లో సగం మందిపై క్రిమినల్ కేసులు
X

ఐదవ సారి బీహార్ సీఎం గా తాజాగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కొత్త మంత్రుల మీద అపుడే ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల సంచలనం రేకెత్తించే నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక బీహార్ మంత్రులలో సగానికి సగం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు తొమ్మిది మంది మీద అల్లర్లు, ఫోర్జరీ వంటి బలమైన ఆరోపణలే ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ మొత్తం 24 మంది మంత్రులలో ఏకంగా 21 మంది కోటీశ్వరులు అని ఈ నివేదిక చెప్పడం మరో సంచలనంగా మారింది. ఇక సగటున చూస్తే ఒక్కో మంత్రి ఆస్తులు అయిదున్నర కోట్ల పై మాటగానే ఉంటాయని లెక్క చెబుతోంది. ఇవన్నీ కూడా ఆయా మంత్రులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లను స్టడీ చేసి ఏడీఆర్ మొత్తం వివరాలను విడుదల చేసింది అని అంటున్నారు.

నితీష్ కి క్లీన్ ఇమేజ్ :

ఇక బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ఐదవసారి సీఎం అయిన నితీష్ కుమార్ కి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ లేదా ఇతరత్రా నేరమయ ఆరోపణలు కానీ ఎక్కడా కనిపించవు. ఆయనకు ఉన్న ఈ ఇమేజ్ కారణంగా బీహర్ ప్రజలు ఇష్టపడతారు. అయితే ఆయన మొత్తం కేబినెట్లో సగం మంది మీద ఈ తరహా కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ లో పేర్కొనడం ఒక విధంగా నితీష్ కుమార్ కి కూడా ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు ప్రభుత్వ సిబ్బంది మీద దాడులు చేయడం అలగే ఎన్నికల నేరాలు, ఫోర్జరీలు మోసాలు, ఇలా తీవ్రమైన అభియోగాలే చాలా మంది మంత్రుల మీద ఉండడం దానిని ఏడీఆర్ బయటపెట్టడంతో ఇపుడు విపక్షాలకు నితీష్ చాన్స్ ఇచ్చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.

కేసులు సమానంగానే :

ఎన్డీయేలో బీజేపీ జేడీయూ ఎల్జేపీ హిందుస్థానీ అవామ్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. ఇక కేసుల విషయం వచ్చేసరికి అన్ని పార్టీల మంత్రుల మీద ఉన్నాయని ఏడీఆర్ ఆసకికరమైన నివేదికను వెల్లడించింది. ఇందులో బీజేపీ నుంచి ఆరుగురు, జేడీయూ నుంచి ఇద్దరు, ఎల్జేపీ నుంచి ఇద్దరు, హిందుస్థానీ అవామ్ మోర్చానుంచి ఒక మంత్రి మీద కేసులు ఉన్నాయని పేర్కొంది. అయితే ఏ ఒక్క కేసులోనూ వీరి మీద ఇప్పటికి అయితే శిక్ష పడలేదని ఈ నివేదిక ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

ఆర్ధికంగా గట్టివారే :

బీహార్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందరికీ తెలిసిందే. పేద రాష్ట్రంగానే ఇప్పటికీ ఉంది. తొమ్మిది కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. అలాంటి బీహార్ ని పాలించే మంత్రులు మాత్రం ఆర్ధికంగా అత్యంత ధనవంతులుగా ఉండడమే చిత్రంగా ఉంది అని అంటున్నారు. మంత్రులు దాదాపుగా అంతా కోటీశ్వరులే అని ఏడీఆర్ తేల్చింది. వీరు తాముగా ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే ఇది తెలుస్తోందని చెబుతోంది.

ఈయన టాప్ :

ఈ మంత్రులలో కూడా టాప్ కరోడ్ పతి ఎవరు అంటే బీజేపీకి చెందిన రామ్ నిషాద్ అని అంటున్నారు. ఆయనకు ఏకంగా 31.86 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెబుతున్నారు. అలాగే ఎల్‌జేపీ కి చెందిన మంత్రి సంజయ్‌కుమార్ 22.3 కోట్ల రూపాయలతో అతి తక్కువ సంపద కలిగిన మంత్రిగా నితీష్ కుమార్ కేబినెట్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇక మొతం 24 మంది మంత్రులలో అప్పులు ఉన్న మంత్రులు కూడా ఉన్నారట. వారు ఏకంగా పదిహేను మంది మంత్రులని చెబుతున్నారు. ఇదిలో ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు అందరిలోనూ ఎక్కువగా 82.33 లక్షల రూపాయల అప్పులున్నాయని చెబుతున్నారు.