బీహార్ లో మళ్ళీ ఓట్ల చోరీ...గెలిచేది ఎవరు ?
బీహార్ లో తొలి విడత ఎన్నికలు పూఒర్తి అయ్యాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో 121 సీట్లకు మొదటి విడతగా పోలింగ్ జరిగింది.
By: Satya P | 8 Nov 2025 9:00 AM ISTబీహార్ లో తొలి విడత ఎన్నికలు పూఒర్తి అయ్యాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో 121 సీట్లకు మొదటి విడతగా పోలింగ్ జరిగింది. అయితే గతానికి భిన్నగా పెద్ద ఎత్తున జనాలు పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చి ఓట్లేశారు. ఇది చూస్తే కనుక రెండు దశాబ్దాల నాటి భారీ పోలింగ్ ని అధిగమించింది అని అంటున్నారు. ఇంత పెద్ద పోలింగ్ జరగడంతో యాంటీ ఇంకెంబెన్సీ ఓటింగా లేక ప్రో ఇంకెంబెన్సీ ఓటింగా అన్నది అయితే విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఆగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
అదే జరుగుతోందంటూ :
బీహార్ లో జరిగిన తొలి విడత పోలింగ్ మీద రాహుల్ గాంధీ విశ్లేషణ సంగతి పక్కన పెడితే ఆయన చేసిన ఆరోపణలే ఆసక్తిని పెంచుతున్నాయి. మరోసారి ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఢిల్లీలో ఓట్లు వేసిన బీజేపీ నేతలు బీహార్ తొలి విడత ఎన్నికల్లో కూడా ఓటు వేశారు అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ సీరియస్ గానే ఆరోపణలు చేశారు. ఆయన ఎక్కడో ఈ ఆరోపణలు చేయలేదు, బీహార్ లోని బాంకా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని ఎన్డీయే ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ లో ఓట్ల చోరీకి ప్రయత్నిస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.
యువతను కట్టడి :
పాలకుల తప్పులను యువత ప్రశ్నించకుండా వారిని ఎన్డీయే ప్రభుత్వం సోషల్ మీడియా రీల్స్ వైపుగా ఉంచుతోందని రాహుల్ గాంధీ మరో ఆరోపణ చేశారు. తాను ఓట్ల చోరీ అని చెబుతూంటే ఈసీ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా అనేక రాష్ట్రాలలో ఇదే విధంగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ సీరియస్ గానే విమర్శలు చేశారు. ఆయన ఈ విమర్శల ధాటి ఎంతగా ముందుకు తీసుకుని వెళ్ళారు అంటే ఓట్లను తారు మారు చేయడం వల్లనే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యారు అని. ఆ విషయం తాను నిరూపిస్తాను అని కూడా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. తాను నకిలీ ఓట్లు ఓట్ల చోరీ అంటూంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎందుకు స్పందన రావడం లేదు అని ఆయన అంటున్నారు.
లక్షల ఓట్లు గల్లంతు :
ఇక హర్యానా ఎన్నికలలో ఏకంగా లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అక్కడ రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే పాతిక లక్షల మద్ని ఓట్లు నకిలీవి అని ఆయన తేల్చారు. ఇదే తీరున మధ్యప్రదేశ్, చత్తెస్ ఘడ్ లోనూ గతంలో జరిగింది అన్నారు. ఇపుడు బీహార్ లో అదే చేయబోతున్నారు అని తనకు అనుమానంగా ఉందని రాహుల్ అంటున్నారు. అంతే కాదు బీహార్ లో లక్షలాది మంది కాంగ్రెస్ మహా ఘట్ బంధన్ ఓటర్ల పేర్లు తొలగించారని వాటి ప్లేస్ లో నకిలీ ఓట్లను తెచ్చి పెట్టారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలే చేశారు.
హోరా హోరీగానే :
మరో వైపు చూస్తే బీహార్ లో హోరా హోరీ పోరు సాగుతోంది. అధికార ఎన్డీయే విపక్ష మహా ఘట్ బంధన్ ఎక్కడా తగ్గడం లేదు, అధికారం మాది అంటే మాది అని ఢీ కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ తాజా ఎన్నికల్లో జరుగుతోంది అంటూ చేసిన ఆరోపణలు చూస్తే కనుక బీహార్ ఫలితాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయనే చెప్పాలి. రెండవ విడత నవంబర్ 11న జరుగుతుండగా రాహుల్ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా నకిలీ ఓట్ల గురించే ప్రస్తావిస్తున్నరు. దాంతో అసలు ఏమి జరుగుతోంది అన్నదే అందరిలోనూ నెలకొంది. చూడాలి మరి ఫలితాలు నవంబర్ 14న వస్తున్న నేపధ్యంలో ఎవరేమిటి అన్నది.
