నితీష్ వన్స్ మోర్...బీజేపీకి సీరియస్ మ్యాటర్
బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థుల జాబితాను వరసబెట్టి రిలీజ్ చేస్తోంది. అవతల వైపు ఆర్జేడీ అదే పని మీద ఉంది
By: Satya P | 17 Oct 2025 8:15 AM ISTబీహార్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. మరో ఇరవై రోజులలో తొలి విడత ఎన్నిక ఈపాటికి పూర్తి అయిపోతుంది. నవంబర్ 6న మొదటి దశ 11న రెండవ దశ బీహార్ లో జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఇక దీపావళి పండుగ దాటనిచ్చి అటు ఎన్డీయే ఇటు మహా ఘట్ బంధన్ పోటా పోటీగా ప్రచారంలోకి దిగిపోతున్నాయి. బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థుల జాబితాను వరసబెట్టి రిలీజ్ చేస్తోంది. అవతల వైపు ఆర్జేడీ అదే పని మీద ఉంది
ప్రతిపక్ష శిబిరం క్లియర్ :
బీహార్ ఎన్నికలో ఒక విషయం అయితే స్పష్టంగా ఉందని చెప్పాలి. మహా ఘట్ బంధన్ గెలిస్తే ప్రతిపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎం అవుతారు. ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రభుత్వంలో పనిచేశారు. అంతే కాదు ప్రతిపక్ష నేతగా పార్టీ అధినేతగా ఉన్నారు నాలుగు పదులకు చేరువలో ఉన్న ఈ యువ నేతను ముందు పెట్టుకుని మహా ఘట్ బంధం తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. యువ నేతతో భారీ మార్పు అని కూడా జనానికి చెబుతోంది. దాంతో కొత్త తరవం యువత మహా ఘట్ బంధన్ వైపు చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.
ఎన్డీయేలో సస్పెన్స్ :
ఇక అధికారంలో ఉన్న ఎన్డీయేలో అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. నితీష్ కుమార్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్న జేడీయూ బీజేపీ ఇతర పక్షాల జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని గట్టిగా చెప్పలేకపోతోంది. దానికి కారణం ఈసారి అధికారంలోకి వస్తే బీజేపీ నుంచే అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలని కమలనాధులు ఆలోచిస్తున్నారు. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మీద కూడా బీజేపీ ఫోకస్ ఉంది అని అంటున్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఇప్పటికి గడచిన రెండు దశబ్దాలుగా నితీష్ కుమార్ బీహార్ కి సీఎం గా ఉన్నారు. ఆయన ఒక విధంగా ప్రజలు పదే పదే చూసేసిన ఫేస్ గానే భావిస్తున్నారు.
నితీష్ వర్సెస్ తేజస్వి :
ఈ విధంగా జనంలోకి వెళ్తున్న ప్రచారం అయితే మొగ్గు కచ్చితంగా తేజస్వికే ఉంటుందని అంటున్నారు. ఎదుకంటే నితీష్ వయసు దాదాపుగా 75 ఏళ్ళు. అదే తేజస్వి ఆయన వయసులో సగం ఉన్నారు. దాంతో ఈసారి కొత్త ముఖానికి యంగ్ బ్లడ్ కి చాన్స్ ఇవ్వాలని యూత్ ఓటర్లు డిసైడ్ అవుతున్నారు. దాంతో ఎన్నో హంగులు ఉన్నప్పటికీ ఎన్డీయే శిబిరం మాత్రం ఈ విషయంలో వెనకబడిపోతోంది. అందుకే నితీష్ మళ్ళీ సీఎం అని గట్టిగా ప్రచారం చేయడంలేదని అంటున్నారు. అలాగని మరో అభ్యర్ధి పేరుని కూడా చెప్పకుండా ఎన్ డీయే చేస్తున్న ప్రచారం అసలుకే ఎసరు తెస్తుందని కూడా అంటున్నారు.
నితీష్ పట్టు :
ఇక ఎన్డీయే మళ్ళీ గెల్స్తే నితీష్ కుమార్ మాత్రమే సీఎం అవుతాను అని జేడీయూ అంటోంది. నితీష్ మనసులో కూడా అదే ఆలోచన ఉందని అంటున్నారు. ఆయన సీఎం గా దశాబ్దాల పాటు కొనసాగుతూ సరికొత్త రికార్డుని స్థాపించాలని చూస్తున్నారు. మాజీ సీఎం అయితే తన రాజకీయ జీవితం ఆగిపోతుందని కూడా ఆలోచిస్తున్నారు. ఆయనకు కేంద్రంలో అవకాశాలు బీజేపీ కల్పించినా ఆయనకు అది తృప్తిని ఇవ్వదని అంటున్నారు దాంతో ఆయన వైపు నుంచి అయితే సీఎం గా మళ్ళీ తానే అన్నది వినవస్తోంది అంటున్నారు. దాంతో బీజేపీ శిబిరంలో అయితే దీని మీదనే సీరియస్ గా డిస్కషన్ సాగుతోంది అని అంటున్నారు. సీఎం అభ్యర్ధిని డిక్లేర్ చేసి ఎన్డీయే ఎన్నికలకు వెళ్తుందా లేక ఎవరూ చెప్పకుండానే ప్రచారం ముగిస్తుందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఏది జరిగినా ఎన్ డీయే కూటమికి అది పెద్ద చిక్కుగానే ఉంటుందని అంటున్నారు.
