Begin typing your search above and press return to search.

సగం బీహార్ లెక్క తేల్చేస్తున్నారు !

ఉత్తరాదిన హిందీ బెల్ట్ లో అతి పెద్ద రెండవ రాష్ట్రంగా బీహార్ ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతునాయి.

By:  Satya P   |   5 Nov 2025 11:13 PM IST
సగం బీహార్ లెక్క తేల్చేస్తున్నారు !
X

ఉత్తరాదిన హిందీ బెల్ట్ లో అతి పెద్ద రెండవ రాష్ట్రంగా బీహార్ ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతునాయి. తొలి దశకు రంగం సిద్ధం అయింది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయి సాయంత్రం ఆరు వరకూ జరగనుంది. మొత్తం 18 జిల్లాలు 121 అసెంబ్లీ నియోజకవర్గాలు తొలి దశలో ఉన్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వంలోని 16 మంది మంత్రులు తొలిదశ బరిలో ఉన్నారు. అంతే కాదు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడు ఆర్జేడీ అగ్రనేత మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం తొలి దశలోనే ఉంది. సగానికి సగం అసెంబ్లీలో జరుగుతున్న మొదటి విడత పోలింగ్ తో బీహారీలు రాజకీయ పార్టీల జాతకాన్ని తేల్చేయనున్నారు. అంతే కాదు రేపటి కొత్త ప్రభుత్వం ఎవరిది ఏర్పడాలో కూడా డిసైడ్ చేయనున్నారు. ఏకంగా మూడున్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని తొలి విడతలో వినియోగించుకో బోతున్నారు. నేతాశ్రీల నుదుట బలంగా తల రాత రాయబోతున్నారు.

భారీ పోటీతో :

బీహార్ లో ఈసారి భారీ పోరు నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే మహా ఘట్ బంధన్ ల మధ్య హోరా హోరీగా ఫైట్ సాగుతోంది. కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉండడంతో రెండు పార్టీలు బలంగా ఢీ కొంటున్నాయి. అటు నుంచి ఇటు ఏ మాత్రం వేవ్ మారినా టోటల్ రిజల్ట్ లోనే తేడా వస్తుంది. అంత కీన్ కంటెస్ట్ గా బీహార్ పోరు ఉంది. ఎవరు విజేతలు ఎవరు పరాజితులు అన్నది తేల్చడానికి ఆఖరి సీటూ ఆఖరి ఓటూ కూడా పట్టి చూడాల్సిందే అని అంటున్నారు.

సర్వేలకు అందని వైనం :

సర్వేశ్వరులు సైతం బీహార్ ఫలితాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎవరు పవర్ అందుకుంటారు అన్నది చెప్పడానికి సెఫాలజిస్టుల పారామీటర్లు గత కాలం ట్రాక్ రికార్డులు కూడా ఏ మాత్రం సరి తూగడం లేదు, ఒక సర్వే మహా ఘట్ బంధన్ అంటే మరో సర్వే ఎన్ డీయే అంటోంది. సరి సమానంగా రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. సామాజిక సమీకరణలు ఉన్నాయి. అలాగే అంగ బలం అర్ధ బలం ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ డీయే ఇండియా కూటములు సైతం సెమీ ఫైనల్స్ గా భావించి బీహార్ ని తమ రాజకీయ క్షేత్రంగా మార్చుకుంటున్నాయి.

మెజారిటీ సాధిస్తేనే :

తొలి విడత పోరులో ఏ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందో వారిదే అధికారం అన్న లెక్క కూడా ఉంది. దాంతో సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లుగా తీర్పు ఉంటే అపుడు అసలైన పోటీ మలి విడతలో ఉంటుంది అని అంటున్నారు. నరేంద్ర మోడీ పొలిటికల్ గ్లామర్ తో పాటు అమిత్ షా ప్రత్యేక వ్యూహాల మధ్య కేంద్ర మంత్రుల వరస పర్యటన మధ్య నితీష్ కుమార్ మంచితనం సానుభూతి మధ్య ఎన్డీయే తన ప్రచారాన్ని జనాలకు చేరువ చేస్తోంది. రాహుల్ అండ్ ప్రియాంక విత్ సోనియా జాతీయ బలం తోడు రాగా కాంగ్రెస్ మద్దతు యువ నేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ అంతే స్థాయిలో వ్యూహాలను రచిస్తూ ఎన్డీయేను గట్టిగానే ఢీ కొడుతున్నారు. మొత్తానికి దేశం మొత్తం ఆసక్తిగా గమనించేలా బీహార్ ఎన్నికలు ఉన్నాయనడం లో సందేహం లేదు. నరాలు తెగే ఈ ఉత్కంఠ వీడాలీ అంటే ఈ నెల 14న ఫలితాల కోసం వేచి చూడక తప్పేట్లు అయితే లేదు.