Begin typing your search above and press return to search.

బీహార్ లో పీకే పార్టీ...గెల్చుడా చీల్చుడా ?

బీహార్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దసరా తరువాత షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Satya P   |   25 Sept 2025 9:11 AM IST
బీహార్ లో పీకే పార్టీ...గెల్చుడా చీల్చుడా ?
X

బీహార్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దసరా తరువాత షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నవంబర్ లో ఎన్నికలు జరిగేందుకు వీలుంది. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 22వ తేదీలోగా కొత్త శాసనసభ సమావేశం అయి తీరాలి. పాత అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తోంది. దాంతో గట్టిగా అంటే ఎన్నికలకు నలభై యాభై రోజుల వ్యవధి కూడా లేదు. మరి బీహార్ లో రాజకీయ చిత్రం ఎలా ఉంది అంటీ చాలానే విషయాలు చెప్పుకోవాల్సి ఉంది.

హోరా హోరీగా :

బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయేకు విపక్షంలో ఉన్న ఇండియా కూటమికి మధ్య హోరాహోరీ పోరు ఈసారి జరగనుంది అని అంటున్నారు. ఈ రెండు కూటముల మధ్య స్వల్పమైన తేడాయే ఉంది అని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఒకటి రెండు శాతం ఓట్లు అటు నుంచి మారితే రాజకీయ జాతకమే మారిపోతుంది అని అంటున్నారు. దాంతో బీహార్ లో రాజకీయం ఎవరి మెడలో వరమాల వేస్తుంది అన్నది ఉంది. మరో వైపు చూస్తే ఈసారి పక్కాగా అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి చేయని ప్రయత్నాలు లేవు.

కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ :

కాంగ్రెస్ ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. 1989 నుంచి బీహార్ యూపీ చేజారి పోయి కాంగ్రెస్ ని దూరం పెట్టాయి. అలాంటి చోట్ల తమ ప్రభావం చూపిస్తే కనుక 2029 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తమదే అని భావిస్తోంది హస్తం పార్టీ. అందుకే రాహుల్ ఓటర్ అధికార యాత్రలు అలాగే ఏకంగా బీహార్ లోనే సీడబ్ల్యూసీ మీటింగులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఆర్జేడీతో పొత్తు కలసివస్తుందని చూస్తున్నారు.

ఎన్డీయే ధీమా అదే :

ఎన్డీయేకు మోడీ అతి పెద్ద ఆకర్షణ. ఇక జీఎస్టీ 2.0తో మధ్యతరగతి వర్గాలలో మంచి ఆదరణ దక్కుతుందని కూడా లెక్కవేసుకుంటున్నారు. అంతే కాదు బీహార్ లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అవి ఓటు బ్యాంక్ ని తెప్పిస్తాయని చూస్తోంది. నితీష్ కుమార్ రాష్ట్రంలో బడా నాయకుడిగా ఉండడం మరో అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఈ లెక్కన తమదే మరోసారి అధికారం అని ఎన్డీయే భావిస్తోంది.

పీకే తులాభారం :

ఈ క్రమంలో పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కొత్తగా పార్టీ పెట్టి జనంలోకి వచ్చారు. జన సురాజ్ పార్టీతో చాలా ముందుగానే ఆయన జనంలో ఉన్నారు. ఆయన పార్టీ ప్రభావం కూడా ఈసారి ఎన్నికల్లో ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఆయనకు అధికారం దక్కకపోయినా గణనీయంగా ఓట్లను చీలుస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా కొత్తగా రాజకీయాలను చూడాలనుకునే వారు యువత అంతా పీకే పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని అంటున్నారు. దాంతో పీకే పార్టీ దండీగానే ఓట్లను చీలుస్తుంది అని విశ్లేషణలు ఉన్నాయి.

ఎవరికి నష్టం అంటే :

ఎక్కడైనా కొత్త పార్టీ మూడో పార్టీ కనుక రంగంలోకి దిగితే మాత్రం అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకే నష్టం అని చాలా విశ్లేషణలు ఉన్నాయి. అధికార పార్టీ మీద అనుకూలత ఉంటే ఆ ఓటు అటే పోతుంది వ్యతిరేకత ఉంటే అది నేరుగా ప్రధాన ప్రతిపక్షం వైపు రావాల్సింది కొత్త పార్టీ కనుక మరొకటి ఉంటే కనుక ఆ వైపునకు ఎంతో కొంత మళ్ళితే ఆ కాడికి తీవ్ర నష్టం విపక్ష పార్టీకే అని అంటున్నారు. అలా పీకే ఎంత పుంజుకుంటే అంత ఇబ్బంది ఇండియా కూటమికే అని అంటున్నారు. మరీ ముఖ్యంగా యువత ఓట్లను పీకే కొల్లగొడితే ఆ మేరకు ఇండియా కూటమికి దెబ్బ తగిలి ఎన్డీయేకు మేలు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే ప్రభావం ఏ మాత్రం అన్నది నవంబర్ లో ఎన్నికల సమరంలో తేలనుంది అని అంటున్నారు.