Begin typing your search above and press return to search.

తేజస్వి యాదవ్ మా సీఎం...ఇంట్రెస్టింగ్ ఒపీనియన్

అయితే ఎవరు సీఎం గా ఉండాలని ఇదే సంస్థ చేసిన సర్వేలో మాత్రం తేజస్వి యాదవ్ అని ఎక్కువ శాతం ప్రజలు మొగ్గు చూపించడం విశేషం.

By:  Satya P   |   13 Nov 2025 4:00 AM IST
తేజస్వి యాదవ్ మా సీఎం...ఇంట్రెస్టింగ్ ఒపీనియన్
X

బీహార్ శాసనసభ ఎన్నికలు ఎంతో ఉత్కంఠను పెంచాయన్నది తెలిసిందే. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటములు తలపడ్డాయి. తామే నేరుగా పోటీ చేసి సీఎం కుర్చీలో కూర్చున్నంతగా ఎన్నికల వేడిని పెంచేశాయి. బీహార్ లో ఎన్డీయే జేడీయూ అనే ఒక ప్రాంతీయ పక్షంతో పొత్తు పెట్టుకుంది. గెలిస్తే సీఎం అభ్యర్ధి జేడీయూ అధినేత నితీష్ కుమార్ అని పేర్కొంది. ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఇంకో ప్రాంతీయ పార్టీ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ కూటా మహా ఘట్ బంధన్ గెలిస్తే సీఎం అయ్యేది ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్. అయినా సరే మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా ఈ పోరు సాగింది. ఇక ఎగ్జిట్ పోల్స్ తీరు చూస్తే ఎన్డీయేకే పట్టం కట్టాయి. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే ఎన్డీయే గెలుస్తుందన్న ఒక సర్వే ఏజెన్సీ సీఎం గా ఎవరు కావాలి అని ఒపీనియన్ పోల్ చేపడితే అందులో అత్యధిక శాతం మంది తేజస్వి యాదవ్ ని సీఎం గా కోరుకోవడం. ఇదెక్కడి రాజకీయ విడ్డూరం అనందే ఇపుడు చర్చగా ఉంది.

తేజస్వి వైపే మొగ్గు :

యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో బీహార్ లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఎన్డీయే అని వచ్చింది. అయితే ఎవరు సీఎం గా ఉండాలని ఇదే సంస్థ చేసిన సర్వేలో మాత్రం తేజస్వి యాదవ్ అని ఎక్కువ శాతం ప్రజలు మొగ్గు చూపించడం విశేషం. బీహార్ సీఎం గా తేజస్వి యాదవ్ ని ఏకంగా 34 శాతం మంది ప్రజలు కోరుకుంటూంటే కేవలం 22 శాతం మంది మాత్రమే నితీష్ కుమార్ ని సీఎం గా కోరుకుంటున్నారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్ధికి 14 శాతం మంది మాత్రమే మొగ్గు చూపిస్తున్నారు. ఎన్డీయే కూటమిలో మిత్ర పక్షంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ కి అయిదు శాతం మద్దతు దక్కడం గమనార్హం.

నితీష్ నచ్చలేదా :

ఒక వైపు యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలో ఎన్డీయే గెలుస్తుందని చెప్పిన వారు సీఎం గా మాత్రం నితీష్ కుమార్ ని ఎందుకు వద్దు అనుకుంటున్నారు అన్నది చర్చ. మరో వైపు చూస్తే ఎన్డీయేకు పట్టం కట్టిన వారు నితీష్ మాత్రం నో అంటున్నారు అంటే అది ఇంట్రెస్టింగ్ పాయింటే. నితీష్ ని కాకుండా ఎన్డీయేకి జై కొడుతున్నారు అంటే అది కూడా విచిత్రమే అంటున్నారు. మరి 34 శాతం మంది కోరుకుంటున్న తేజస్వికి చెందిన మహా ఘట్ బంధన్ ఎందుకు అధికారం చేపట్టదని కూడా చర్చ ఉంది. తేజస్వి నచ్చితే ఆటోమేటిక్ గా ఆయన పార్టీని కూడా గెలిపిస్తారు కదా అన్నది ఒక లాజిక్. అంతే కాదు మహా ఘట్ బంధన్ గెలిస్తే కదా తేజస్వి సీఎం అవుతారు అన్నది కూడా ఉంది. ఈ మాత్రం తెలియని ఓటర్లు ఉంటారా అన్నది కూడా ఒక పాయింట్. ఏది ఏమైనా చూస్తే కనుక ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలలో తేడా ఎక్కడో కొడుతోందా అన్నది అతి పెద్ద డిబేట్ గా ఉంది.

బీహార్ నాడి ఏంటో :

బీహార్ ప్రజల నాడిని పట్టడంతో సర్వే ఏజెన్సీలు ఎపుడూ రాంగ్ చేస్తూనే ఉన్నాయని గత సర్వేలు నిరూపించాయి. ఇపుడు కూడా అలాగే జరుగుతోందా అన్నదే ఒక డౌట్ గా చెబుతున్నారు. తేజస్వికి మంచి ఆదరణ ఉందని ప్రీ పోల్ సర్వేలూ చెప్పాయి. ఒక నాయకుడికి ఉన్న ఆదరణ ఆటోమేటిక్ గా ఆ పార్టీకి ఆ పార్టీ ఉన్న కూటమికి టర్న్ కావడం రాజకీయాల్లో జరిగేదే. మరి ఈ లెక్కన మహా ఘట్ బంధన్ కి చాన్సెస్ ఉన్నాయా అంటే అవును అనే అంటున్నారు. సో ఈ నెల 14 వరకూ వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.