Begin typing your search above and press return to search.

జగన్ తరువాత ఆయనకు షాక్

గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సీఎం తరువాత స్థానంలో ఉన్న తేజస్వి యాదవ్ ఈసారి మాత్రం మహా ఘట్ బంధన్ కూటమి పక్ష నేతగానే అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు.

By:  Satya P   |   15 Nov 2025 6:00 AM IST
జగన్ తరువాత ఆయనకు షాక్
X

అదేమిటో జనాలకు ప్రేమ ఎక్కువ అయితే వార్ వన్ సైడ్ అయిపోతోంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీని అందిస్తున్నారు. గత ఏడాది ఏపీలో అలాగే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు. దాంతో అప్పటిదాకా 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఓటర్ల సంచలన తీర్పుతో ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. దాంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.

తేజస్వీకి సైతం :

ఇక బీహార్ లో లాలూ యాదవ్ వారసుడిగా అలాగే రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పదవిని అందుకుని రాజ్యం చేసిన నేతగా ఆర్జేడీ అగ్ర నేతగా అంతకు ముంచి 2020 నుంచి 2025 వరకూ అయిదేళ్ళ పాటు ప్రతిపక్ష నాయకుడిగా హవా చలాయించారు తేజస్వి యాదవ్, ఇక తాజా ఎన్నికల్లో ఆయన మహా ఘట్ బంధన్ తరఫున సీఎం అభ్యర్ధిగా ఎంపిక అయ్యారు. అలా బరిలోకి దిగిన ఆయనకు ఓటర్లు గట్టి ఝలక్ ఇచ్చారు. దాంతో సీఎం సీటు దేముడెరుగు బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ అతి చిన్న పార్టీగా మారిపోయింది.

మైకు దక్క్తుందా:

గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సీఎం తరువాత స్థానంలో ఉన్న తేజస్వి యాదవ్ ఈసారి మాత్రం మహా ఘట్ బంధన్ కూటమి పక్ష నేతగానే అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. ఆయనకు విపక్ష హోదా ఆర్జేడీ నేతగా కంటే కూటమి తరఫున మాత్రమే దక్కవచ్చు అని అంటున్నారు. ఆ విధంగా బీహార్ జనాలు తాజా తీర్పు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీలో పూర్తిగా ఎన్డీయే నూటికి ఎనభై శాతం పైగా పరచుకుంటుంది. దాంతో విపక్షంలో అతి తక్కువ సీట్లతో మహా ఘట్ బంధన్ సర్దుకోవాల్సిన నేపథ్యం ఉంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లలో మహా ఘట్ బంధన్ కి కేవలం 34 మాత్రమే దక్కాయి. దాంతో విపక్షాల గొంతు వినిపిస్తుందా మైకు దక్కుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

బిగ్ సౌండ్ తోనే :

మరో వైపు అధికార పక్షం బిగ్ సౌండ్ చేయనుంది. మొత్తం అసెంబ్లీ నిండా వారే ఉండడంతో శాసన సభ అంటే ఎన్డీయే కూటముల పార్టీ ఎమ్మెల్యేలతోనే కొలువు తీరనుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే జంబో జెట్ లాంటి అధికార పక్షం మీద దూకుడు చేయడం ఇపుడున్న సంఖ్యా బలంతో మహా ఘట్ బంధన్ కి అతి పెద్ద సవాల్ గానే ఉంది అని అంటున్నారు. ప్రజలు బీహార్ లో యాంటీ ఇంకెంబెన్సీ అంతా విపక్షంలో ఉన్న ఆర్జేడీ ఇతర పార్టీల మీద చూపించారు అని కూడా అంటున్నారు. లేకపోతే రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ పార్టీకి 80 శాతం పైగా సీట్లు ఇచ్చి ఆర్జేడీకి కాంగ్రెస్ కి ఇతర పార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా కోత కోయడం అంటే బీహారీల తీర్పు ఒక సంచలనంగా మారింది అని అంటున్నారు.