Begin typing your search above and press return to search.

బీజేపీకి ఫస్ట్ టైం జెన్ జీ దెబ్బ ?

ఇదిలా ఉంటే బకింపూర్ ఉప ఎన్నిక జూలై 30న జరిగింది. 2024లో జరిగిన ఎన్నికల్లో జన సురాజ్ తరఫున అభ్యర్ధిని ఇక్కడ పోటీకి పెడితే కేవలం అయిదు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

By:  Satya P   |   3 Aug 2026 6:00 PM IST
బీజేపీకి ఫస్ట్ టైం జెన్ జీ దెబ్బ ?
X

బీజేపీకి ఎదురులేని సీటులో తిరుగులేని రాష్ట్రంలో ఇపుడు ఓటమి సంభవించబోతోంది. ఆ సీటు బీహార్ లో ప్రతిష్టాత్మకమైన బకింపూర్. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు దశాబ్దాల తరువాత ఓటమి అంచుకు వెళ్ళడం చూస్తూంటే తేడా ఎక్కడో కొడుతున్నట్లుగానే ఉంది. 2025 అక్టోబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. భారీ విజయం బీజేపీ జేడీయూ కూటమిది అయింది. అయితే కొన్నాళ్ళ పాటు సీఎం గా నితీష్ కుమార్ ని ఉండనిచ్చిన బీజేపీ ఈ ఏడాది మే నెలలో ఆయన ప్లేస్ లో తమ పార్టీకి చెందిన సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టింది. అదే బీహార్ నుంచి బకింపూర్ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన నితిన్ నబిన్ ని జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ చేసి రాజ్యసభకు పంపింది. అందుకే ఇపుడు బకింపూర్ కి ఉప ఎన్నికలు వచ్చాయి.

పీకే ప్రతాపంతో :

ఇదిలా ఉంటే బకింపూర్ కి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని వెనక్కి నెట్టి జన సురాజ్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ముందుకు దూసుకుని వచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేయని పీకే ఇపుడు మాత్రం తన ప్రతాపం చూపిస్తున్నారు. ఆయన బీజేపీ కంచుకోటలో తలపడడమే కాదు 1995 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న బీజేపీ ప్రాభవానికి అడ్డు తెర వీఅశారు. దాంతో ఈ రకంగా బీజేపీ ఇబ్బందులలో పడడం వెనక ఏమి జరిగి ఉంటుంది, ఏ శక్తులు పనిచేశాయన్నది చూస్తే కనుక ఆశ్చర్యకరమైన విషయాలే బయటకు వస్తున్నాయి.

జెన్ జీ షాక్ ఇలా :

జెన్ జీ ఈ ఉప ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించింది అని అంటున్నారు. పీకే వ్యూహానికి జెన్ జీ చోదక శక్తిగా తోడు కావడం వల్లనే కాషాయం కోట కుప్ప కూలుతోంది అని అంటున్నారు. ఈ మధ్యనే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో ఎక్కువగా యూపీ బీహార్ పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచే పెద్ద సంఖ్యలో యువత పాలు పంచుకుంది. వారంతా జెన్ జీ తరం అని అంటున్నారు. దేశంలో యువత తమ అసంతృప్తిని ఆ విధంగా ఆందోళనల ద్వారా వెళ్లగక్కింది. అయితే తమ దెబ్బ రుచి చూపించాలని కూడా అనుకుంటే దానికి అంది వచ్చిన అవకాశంగా బీహార్ లోని ప్రతిష్టాత్మకమైన బకింపూర్ ఉప ఎన్నిక కలసి వచ్చింది. దాంతో జెన్ జీ పట్టుబట్టి మరీ కాషాయం పార్టీని వెనక్కి నెట్టిందని విశ్లేషిస్తున్నారు. మరి ఇదే తీరున జెన్ జీ ఆగ్రహం కొనసాగుతుందా ఒక వేళ అదే జరిగితే వచ్చే ఏడాది జరిగే యూపీ గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికల పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా బీజేపీకి షాకుల మీద షాకులు ఇచ్చేందుకు జెన్ జీ సిద్ధపడుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి.

బకింపూర్ ఉప ఎన్నిక :

ఇదిలా ఉంటే బకింపూర్ ఉప ఎన్నిక జూలై 30న జరిగింది. 2024లో జరిగిన ఎన్నికల్లో జన సురాజ్ తరఫున అభ్యర్ధిని ఇక్కడ పోటీకి పెడితే కేవలం అయిదు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. ఏకంగా ప్రశాంత్ కిశోర్ ఇక్కడ దూసుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా ప్రచారం పీకే చేస్తే స్టార్ కాంపెయిన్ బీజేపీ చేసింది. అయినా సరే 2024లో పోల్ అయిన ఓట్ల శాతం 41.45 శాతానికి కంటే ఉప ఎన్నికల పోలింగ్ తక్కువగా నమోదు అయిని. అంటే34.24 శాతం అన్న మాట. దీంతో బీజేపీదే విజయం అని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. కానీ బీజేపీ మద్దతుదారులు ఎవరూ ఓటింగ్ కి వెళ్ళలేదని వారు నిరాసక్తతగా ఉన్నారని కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీని ఓడించాలనుకున్న వారు పంతం బట్టి మరీ బూత్ ల దాకా వెళ్ళారని అంటున్నారు.