బీహార్ దంగల్: ఎవరిని గెలిపించినా.. డబ్బులే!
ఒకరకంగా చెప్పాలంటే.. పార్టీల మధ్య, కూటమిల మధ్య పోటీ పెరిగి.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్న నేపథ్యంలో ఈ నగదు హామీలకు వేలంపాట మాదిరిగా పోటీ పెరగింది.
By: Garuda Media | 27 Oct 2025 9:27 AM ISTఎన్నికలంటే.. ఒకప్పుడు అభ్యర్థిని బట్టి.. పార్టీని బట్టి ప్రజలు ఎంచుకుని ఓటేసేవారు. ఇప్పటికీ ఈ సంస్కృతి ఉన్నా.. రాను రాను ఎన్నికల సమయంలో పార్టీలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు కూడా ఈ సంస్కృతికి దూరమవుతున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లో తలపడుతున్న రెండు ప్రధాన కూటములు.. కూడా ప్రజలను డబ్బులతో కొడుతున్నాయి. అధికారంలోకి వస్తే.. ఒకప్పుడు అభివృద్ధి చేస్తాం.. ప్రాజెక్టులు తెస్తాం.. అని చెప్పిన పార్టీలు.. ఇప్పుడు మీకు ఇంతి స్తాం.. అంతిస్తాం.. అని చెబుతున్నాయి.
దీనిలో బీజేపీ కూడా చేరిపోయింది. ఒకప్పుడు ఉచిత పథకాలకు.. ఆర్థిక పథకాలకు కడు దూరమని.. ఇలాంటి వాటివల్ల దేశంపై భారం పెరుగుతుందని ఉవచించిన నాయకులు.. పాలకులు కూడా.. ఇప్పుడు అదే బాట పడుతున్నారు. తాజాగా బీహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమిలు.. ప్రజ లకు సొమ్ముల రూపంలో తాయిలాలు ప్రకటిస్తున్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే.. పార్టీల మధ్య, కూటమిల మధ్య పోటీ పెరిగి.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్న నేపథ్యంలో ఈ నగదు హామీలకు వేలంపాట మాదిరిగా పోటీ పెరగింది. ఒకరు రూ.10 వేలు ఇస్తామం టే.. మరొకరు.. మరో రూపంలో 30 వేలు ఇస్తామని.. ఇంకొకరు.. 50 వేలు.. లక్ష అంటూ.. పాట పాడుతున్నా రు. దీంతో బీహార్ ఎన్నికల సంగ్రామంలో ఎవరిని గెలిపించినా.. ప్రజలకు డబ్బులే డబ్బులు! అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హామీలు ఇవీ..
+ ఏటా మహిళలకు 35 ఏళ్లు నిండిన వారికి 10 వేల చొప్పున సాయం.
+ ప్రతి నెలా 18-35 మధ్య ఉన్న మహిళలకు రూ.1000 చొప్పున నగదు.
+ ప్రతి 4 మాసాలకు ఒకసారి ఫ్రీ సిలిండర్(మొత్తంగా 3).
+ ఇంటి రిజిస్ట్రేషన్‌లో మహిళలకు ఫ్రీ.
+ సామాజిక భద్రతా పింఛను రూ.3000లకు పెంపు.
కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ హామీలు ఇవీ..
+ అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులరైజేషన్
+ నెలకు రూ.10-15 వేల మధ్య ఉన్న జీతాలు .. ఏకమొత్తంగా రూ.30 వేలకు పెంపు.
+ మహిళలకు ఏటా రూ.15000 నగదు సాయం.
+ మహిళలు ఇంటి పట్టా నమోదుకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఫ్రీ.
+ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏటా 4.
+ పంచాయతీ రాజ్ ఉద్యోగుల వేతనాలు రెట్టింపు.(ప్రస్తుతం 15-20 వేలుగా ఉంది)
+ ఉద్యోగులు అందరికీ ప్రమాద బీమా 50 లక్షలు.
