Begin typing your search above and press return to search.

మౌనిక ముందు మూడు ఆప్ష‌న్లు... మంచు సెల‌క్ష‌న్ ఏంటో?

ప్ర‌స్తుతం మౌనిక సోద‌రి అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. మౌనిక నేరుగా ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డాలంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అఖిల ప్రియ వ‌దులుకుంటారా?

By:  Garuda Media   |   7 Jun 2026 11:30 AM IST
మౌనిక ముందు మూడు ఆప్ష‌న్లు... మంచు సెల‌క్ష‌న్ ఏంటో?
X

మంచు మౌనిక‌. క‌లెక్ష‌న్ కింగ మోహ‌న్‌బాబు కోడ‌లుగానే కాకుండా.. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. భూమా నాగిరెడ్డి కుమార్తెగా ఆమెకు మంచి పేరుంది. ఫైర్ బ్రాండ్ మాదిరిగా ఆమె ఏ విష‌యంపైనైనా అల‌వోక‌గా మాట్లాడ‌డంలో మౌనికకు కొట్టినపిండి. ఒక్క‌సారి 2017లో నంద్యాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల వీడియోల‌ను గ‌మ‌నిస్తే.. అప్ప‌టి ప్ర‌చారంలో మౌనిక స్వ‌రం.. స‌త్తా క‌నిపిస్తాయి. ఆ త‌ర్వాత‌.. మంచువారింటి కోడ‌లు అయింది.

ఇక‌, ప్ర‌స్తుతం లెక్క‌ల ప్ర‌కారం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేయ‌డంతోపాటు.. ఎన్నిక ల్లోనూ పోటీకి మౌనిక రెడీ అవుతోంది. ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త‌, హీరో.. మంచు మ‌నోజ్ చెప్పారు. ఇక‌, ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. మౌనిక ముందు మూడు ఆప్ష‌న్లు ఉంచిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్ర‌య‌త్నించ‌డ‌మా.. లేక నామినేటెడ్ ప‌ద‌విని తీసుకుని పార్టీ కోసం ప‌నిచేయ‌డ మా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది.

ప్ర‌స్తుతం మౌనిక సోద‌రి అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. మౌనిక నేరుగా ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డాలంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అఖిల ప్రియ వ‌దులుకుంటారా? అనేది చూడాలి. ఇక‌, మ‌రో రెండు స్థానాల విష‌యానికకి వ‌స్తే.. శ్రీశైలం, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మౌనిక ముందు ఉన్నాయ‌ని చెబుతున్నారు. శ్రీశైలం మాట ఎలాఉన్నా.. నంద్యాల నుంచి ఆమె పోటీ చేయొచ్చ‌న్న స‌మాచారం వ‌స్తోంది. గ‌తంలో భూమా కుటుంబానికి అంత్యంత కీలక నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న నంద్యాల‌.. ఆమెకు క‌ల‌సి వ‌స్తుంద‌ని అంటున్నారు.

టీడీపీలోకే..!

ఇదిలావుంటే.. భూమా మౌనిక ప్ర‌స్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఏ పార్టీ కండువా కూడా క‌ప్పుకోలేదు. అయితే.. టీడీపీకి అనుకూలంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కూడా మంచు మ‌నోజ్ అధికారిక టీడీపీకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. సో.. దీనిని బ‌ట్టి మౌనిక కూడా టీడీపీ బాట‌లోనే న‌డుస్తార‌ని తెలుస్తోంది. దీంతో ఆమెకునంద్యాల టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం. ఏదేమైనా.. ప్ర‌స్తుతం మూడు ఆప్ష‌న్లు..మౌనిక ముందు ఉన్నాయ‌ని చెబుతున్నారు. వీటిలో ఆమె నంద్యాల‌కే మొగ్గు చూపే అవ‌కాశం ఉంది.