ఉత్తరాది ఉక్కబోత...భోగాపురం మోడీకి ఊరట !
ప్రధాని నరేంద్ర మోడీ గత రెండున్నర నెలలుగా రాజకీయంగా ఒత్తిడితోని ఎదుర్కొంటున్నారు. విద్యార్ధి ఉద్యమాలు అయితే రెండు నెలలకు పైగా ఢిల్లీ వేదికగా సాగాయి.
By: Satya P | 31 July 2026 9:08 AM ISTప్రధాని నరేంద్ర మోడీ గత రెండున్నర నెలలుగా రాజకీయంగా ఒత్తిడితోని ఎదుర్కొంటున్నారు. విద్యార్ధి ఉద్యమాలు అయితే రెండు నెలలకు పైగా ఢిల్లీ వేదికగా సాగాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు అయితే ఉద్రిక్త వాతావరణాన్ని ఒక దశలో పెంచాయి. నేరుగా ప్రధాని నివాశం వద్దనే కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అలాగే ఎంపీ ప్రియాంకా గాంధీ సహా కీలక నేతలు అంతా ధర్నా నిర్వహించడం ఈ మధ్య కాలంలో ఎవరూ చూడని అరుదైన సందర్భం. ఇక పార్లమెంట్ లో చూస్తే రోజూ చర్చ కంటే రచ్చ సాగుతోంది. పేపర్ లీకేజికి యాంటీగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నా విపక్షం అయితే మోడీ సర్కార్ నే తప్పు పడుతోది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇపుడు అమిత్ షాని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. ఇలా వరుసగా ఒక దానిని మించి మరొకటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో మోడీకి ఆట విడుపు అన్నట్లుగా భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ గొప్ప ఊరటను ఇస్తుంది అని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఇదే :
ప్రధాని మోడీ అయితే సాధారణంగా ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆయన దేశంలో ఉన్నపుడు అనేక కార్యక్రమాలలో కనిపిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఓపెనింగ్ సెర్మనీలో పాలు పంచుకోవడం మోడీకి ఇదే తొలిసారి అని అంటున్నారు. ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో మూడు వేల ఎకరాలలో అద్భుతంగా నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభం అన్నది దేశంలోనే ఒక కలికి తురాయి లాంటి కార్యక్రమం అని అంటున్నారు. దాంతో మోడీ రాక కోసం ఏపీ ఎంతగా ఎదురుచూస్తుందో మోడీ సైతం ఏపీకి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.
కీలక ప్రకటనలు :
మోడీ ఈ మధ్య వరుసగా వీడియోలు చేసి ఇన్స్టాగ్రాంలో పెడుతున్నారు. అలాగే ఆయన తన భావాలను పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. అయితే విద్యార్ధుల ఆందోళన ముగిసిన నేపథ్యం, పేపర్ లీకేజి కి వ్యతిరేకంగా చేసిన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక తొలిసారి మోడీ ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. మరి ఆయన ఏమి మాట్లాడతారు అన్న చర్చ అయితే సాగుతోంది. అంతే కాదు ఆయన ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది కూడా ఆసక్తిగా అంతా చూస్తున్నారు.
యువతకు సందేశంగా :
ఇక మోడీ అయితే ఇటీవల కాలంలో యువతను ఉద్దేశించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దాంతో ఆయన వారిని ఉద్దేశించి సందేశం భోగాపురం వేదికగా ఇవ్వబోతారా అన్న చర్చ సాగుతోంది. అలాగే ఆయన ఏపీ నుంచి దేశానికి కూడా ఏమైనా చెబుతారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. తన మనసులోని భావాలను ఆయన వెల్లడించడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కీలక వేదికగా భావిస్తున్నారు.ఇక దేశంలో అనేక చోట్ల విద్యార్ధి ఉద్యమాలు పెద్ద ఎత్తున సాగినా ఏపీలో మాత్రం అంతా ప్రశాంతంగానే ఉంది. మరి దీనిని కూడా దృష్టిలో ఉంచుకుని మోడీ ఏపీ గురించి ఏమైనా మాట్లాడుతారా అన్నది చూడాల్సి ఉంది. అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాల మీద కూడా ప్రధాని స్పందిస్తూ తన ప్రసంగం చేస్తారా అని కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి ఆగస్టు 1వ తేదీన ఉదయం పది గంటల నుంచి మోడీ భోగాపురం ఎయిర్ పోర్టులో సందడి చేయనున్నారు. దాదాపుగా మూడు గంటల పాటు అక్కడ గడిపే మోడీ మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యే గొప్ప బహిరంగ సభ నుంచి స్పష్టంగా సూటిగానే జాతికి సందేశం ఇస్తారని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.
