Begin typing your search above and press return to search.

కూట‌మి సేఫ్‌: మ‌రోసారి ప‌క్కా ఫ్రూవ్ అయ్యింది... !

నిజానికి కూట‌మి అనైక్య‌త దిశ‌గా ప్ర‌యాణిస్తోంద‌న్న ప్ర‌త్య‌ర్థుల వ్యాఖ్య‌ల కు భిన్నంగా భోగాపురంలో క‌లివిడి క‌నిపించింది.

By:  Garuda Media   |   3 Aug 2026 5:00 PM IST
కూట‌మి సేఫ్‌:  మ‌రోసారి ప‌క్కా ఫ్రూవ్ అయ్యింది... !
X

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా.. కేవ‌లం పొగ‌డ్త‌లు.. ప్ర‌శంస‌లు మాత్ర‌మే కాదు.. కూట‌మి ఐక్య‌త కూడా స్ప‌ష్టం గా క‌నిపించింది. దీనిని కాస్త లోతుగా ప‌రిశీలిస్తే.. మూడు పార్టీలు చ‌క్క‌ని స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాయి. నిజానికి రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. కూట‌మి ఇంత బ‌లంగా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌రు. దేశ‌వ్యా ప్తంగా ఎన్డీయే ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మ‌హారాష్ట్ర‌, అస్సాం, గోవా వంటి రాష్ట్రాల్లో ఎన్డీయే నేత‌ల మ‌ధ్య కొంత తేడా కొడుతోంది. దీనికి భిన్నంగా ఏపీలో మూడు పార్టీల నాయ‌కులు కూడా క‌లిసి ఉన్నార‌న్న బ‌ల‌మైన సంకేతాలు పంపించ‌డంలో భోగాపురం కీల‌క రోల్ పోషించింది. క్షేత్ర‌స్థాయి నాయ‌కుల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆది నుంచి కూడా పైస్థా యిలో నేత‌లు క‌ల‌సి క‌ట్టుగా ఉన్నారు. అయితే.. తాజాగా భోగాపురం కార్య‌క్ర‌మంలో క్షేత్ర‌స్థాయిలోనూ ఐక్య త‌ను ప్ర‌తిబింబించేలా స్ప‌ష్ట‌త క‌నిపించింది.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు క‌ల‌సి క‌ట్టుగా ఉన్నాయ‌ని చెప్ప‌డానికి భోగాపురం చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా నిలి చింద‌ని అంటున్నారు. ముఖ్యంగా 2 విష‌యాలు ఈ వేదిక‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కూట‌మిలో ఎలాంటి అసౌక‌ర్యం లేక‌పోవ‌డం ఒక‌టి. నిజానికి కూట‌మి అనైక్య‌త దిశ‌గా ప్ర‌యాణిస్తోంద‌న్న ప్ర‌త్య‌ర్థుల వ్యాఖ్య‌ల కు భిన్నంగా భోగాపురంలో క‌లివిడి క‌నిపించింది. ఇది పైస్థాయిలోనే కాదు.. క్షేత్ర‌స్థాయి నాయ‌కుల మ‌ధ్య కూడా ఎక్కువ‌గా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌స‌మీక‌ర‌ణ నుంచి ఏర్పాట్ల వ‌ర‌కు క‌లివిడిత‌నం క‌నిపిస్తోంది. ఇక‌, నాయ‌కుల మ‌ధ్య క్షేత్ర‌స్థాయిలో చిన్న పాటి విభేదాలు ఉన్నా.. భోగాపురం వంటి భారీ కార్య‌క్ర‌మం విష‌యానికి వ‌స్తే.. అంద‌రూ చేతులు క‌లిపారు. త‌ద్వారా.. కూట‌మి అవ‌స‌రం ఉన్న‌ప్పుడు.. ఖ‌చ్చితంగా ఏకం అవుతామ‌న్న సంకేతాల‌ను పంపించిన‌ట్టు అయింది. ఇది రాబోయే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరుగుతుంద‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే.. కీల‌క స‌మ‌యాల్లో కూట‌మి ఎక్క‌డా బెస‌గ‌లేద‌న్న సంకేతాల‌ను నాయ‌కులు పంపించారు. మొత్తంగా కూట‌మి సేఫ్‌గానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.