Begin typing your search above and press return to search.

బేగంపేట మాదిరిగా విశాఖ ఎయిర్ పోర్ట్

ఇదిలా ఉంటే విశాఖ నుంచి భోగాపురానికి ఎంత దూరం ఉంది అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది.

By:  Satya P   |   11 Jan 2026 5:00 AM IST
బేగంపేట మాదిరిగా విశాఖ ఎయిర్ పోర్ట్
X

ఉత్తరాంధ్రకు తలమానికంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తయారు అవుతోంది. ఈ ఏడాది జూన్ లో ఈ పోర్టు నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ మీదట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ భోగాపురానికి నేరుగా ల్యాండ్ అవుతాయి. ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న భోగాపురానికి డెవలప్మెంట్ ఈ విధంగా దూసుకుని వస్తోంది. అంతే కాదు ఏపీకే గ్రోత్ ఇంజన్ గా భోగాపురం ఎయిర్ పోర్టు మారబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెవలప్మెంట్ యాంగిల్ లో చూస్తే అతి పెద్ద సక్సెస్ గా దీనిని అంతా చూస్తున్నారు.

విశాఖ టూ భోగాపురం :

ఇదిలా ఉంటే విశాఖ నుంచి భోగాపురానికి ఎంత దూరం ఉంది అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. అయితే ఈ దూరం యాభై కిలోమీటర్ల దాకా ఉంటోంది. భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవాలీ అంటే ఒక గంటా ముప్పయి నిముషాల సమయం కచ్చితంగా పడుతుంది. అది కూడా అప్రోచ్ రోడ్స్ ఉండాలి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు లైన్ల రోడ్లు పడితే ఈ దూరం ఈ సమయం లెక్కింపునకు వస్తాయి. అలా కాకపోతే ప్రస్తుతానికి ఆనందపురం జంక్షన్ మీదుగానే సిటీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విశాఖ నుంచి ఎవరైనా భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే సమయాభావం దూరం రెండూ ఉంటాయని అంటున్నారు.

డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం :

ఈ నేపధ్యంలో డొమెస్టిక్ ఫ్లైట్స్ రాకపోకల కోసం భోగాపురం ఎయిర్ పోర్టు దాకా వెళ్ళి రావడం అంటే టైం మ్యాటర్ అన్నది కూడా ఉంది అంటున్నారు. దీని మీద విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. విశాఖ నుంచి విజయవాడ వంటి ప్రాంతాలకు పోవాలీ అంటే భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా సమయం దూరం రెండూ ఎక్కువే అని ఆయన అంటున్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్ పోర్టుని అలాగే కొనసాగించి డొమెస్టిక్ ఫ్లైట్స్ నడిచేలా చూడాలని ఆయన కోరారు ఈ మేరకు డీఆర్డీఏ సమావేశంలో ఎమ్మెల్యే సూచించినట్లుగా మీడియాకు చెప్పారు.

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం :

హైదరాబాద్ లోని శమ్షాబాద్ ఎయిర్ పోర్టు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం కేటాయించినట్లుగా భోగాపురం ఎయిర్ పోర్టుని కూడా అలాగే ఉంచాలని ఆయన అంటున్నారు. అపుడు విజయవాడ తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్ళాలంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ని ఎయిర్ ట్రావెలర్స్ ఉపయోగించుకుంటారు అని ఆయన అంటున్నారు. ఒకసారి భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ కాగానే విశాఖ ఎయిర్ పోర్టుని మూసివేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో దానిని మూసివేయకుండా కొనసాగించాలని ఎమ్మెల్యే కోరుతున్నారు దీని వల్ల విశాఖ ఎయిర్ పోర్టు భోగాపురం రెండూ వృద్ధి చెందుతాయని ఆయన అంటున్నారు మరి నేవీ కంట్రోల్ లో ఉన్న విశాఖ ఎయిర్ పోర్టు విషయంలో రాష్ట్రం కేంద్రం ఏ రకంగా ప్రతిపాదనలు పెడతాయో చూడాల్సి ఉంది. అలాగే భోగాపురం నుంచి డొమెస్టిక్ ఎయిర్ సర్వీసులను మినహాయించాలని కోరుతున్న నేపధ్యంలో ఆ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా ఆలోచించాల్సిందే. అయితే ప్రాక్టికల్ గా చూస్తే ఎమ్మెల్యే చేసిన సూచనలు విలువైనవిగానే అంతా భావిస్తున్నారు.