Begin typing your search above and press return to search.

భోగాపురం ఎయిర్ పోర్టు..... లక్ష బహుమతి ఆఫర్ !

ఈ ఎయిర్ పోర్టు ప్రారంభం కోసం వాణిజ్య విమానంలో ఆగస్టు ఫస్ట్ న ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోకున్నారు.

By:  Satya P   |   23 July 2026 7:12 PM IST
భోగాపురం ఎయిర్ పోర్టు..... లక్ష బహుమతి ఆఫర్   !
X

ఉత్తరాంధ్రకే గేమ్ చేంజర్ గా రూపుదిద్దుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1న ప్రారంభోత్సవం జరుపుకుంటున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇపుడు గర్వంగా గౌరవంగా నిలవనుంది. భావి తరాలకు ఈ ఎయిర్ పోర్టు ఒక దిక్సూచిగా కూడా మారనుంది. ఈ ఎయిర్ పోర్టు ఓపెనింగ్ నేపథ్యంలో పండుగ వాతావరణం అయితే ఉత్తరాంధ్రాలో మొదలైంది. ఇది గొప్ప వేడుకగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు మొదలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం వినూత్న పోటీ నిర్వహిస్తోంది.

బెస్ట్ స్లోగన్ మీదే చాన్స్ :

ఇదిలా ఉంటే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో ప్రతిబింబించేలా తెలుగులో ఆకట్టుకునే స్లోగన్ రూపొందించిన వారికి ఒక లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనున్నట్లుగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఆరవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఈ స్లోగన్ పేరు, చదువు, చిరునామా, మొబైల్ నంబర్ తో కలిసి ఈ నెల 25 సాయంత్రం 5 గంటల లోపు airportslogan@gmail.comకు పంపాలని, లేదా 9440749687 వాట్సాప్ నంబర్ కు పంపాలని ఆయన సూచించారు.

అతిరధ మహారధులంతా :

ఈ ఎయిర్ పోర్టు ప్రారంభం కోసం వాణిజ్య విమానంలో ఆగస్టు ఫస్ట్ న ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోకున్నారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ల్యాండ్ అయ్యే తొలి విమానం ప్రధాని మోడీదే అవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఎయిర్ పోర్టు రెగ్యులర్ ఆపరేషన్స్ కి సంబంధించిన డేట్ ని తరువాత ఫిక్స్ చేస్తామని చెప్పారు మరో వైపు చూస్తే ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మొహల్, మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు అంతా హాజరు కానున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఇన్విటేషన్ మీద ఉంచారు కానీ కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన దృష్ట్యా పబ్లిక్ ఫంక్షన్ కి ఎంత మేరకు హాజరవుతారో అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా ఆగస్టు ఫస్ట్ అన్నది ఉత్తరాంధ్ర ప్రజానీకం గుండెలలో నిలిచిపోయేదిగా ఉంటుంది అన్న దాంతో సందేహం లేదు.