భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం ఇప్పట్లో కాదా ?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసినది నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురుచూస్తోంది.
By: Satya P | 3 July 2026 5:00 AM ISTభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసినది నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురుచూస్తోంది. ప్రధాని చేతులో మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని ప్రారంభించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రధాని అనుమతి కోసం అధికారులు పీఎంఓ ఆఫీసుకి ఆ మధ్యనే లేఖ రాశారు. ప్రధానికి వీలు అయిన తేదీలు చెబితే ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని పేర్కొన్నారు. జూలై 5న ప్రధాని మోడీ అనుకున వచ్చేందుకు వీలు చేసుకుంటే కార్యక్రమం బ్రహ్మాండంగా జరిపించేందుకు కూడా అంతా సిద్ధం చేశారు. అయితే మరో రెండు రోజులలో 5వ తేదీ వచ్చేస్తోంది. పీఎంఓ నుంచి ఇప్పటికి అయితే ప్రధాని టూర్ షెడ్యూల్ అన్నది ఖరారు కాలేదని అంటున్నారు. ప్రధాని పూర్తి బిజీగా ఉండడమే ఇందుకు కారణం అని అంటున్నారు.
మరో డేట్ కూడా రెడీగా :
ఒక వేళ జూలై 5వ తేదీ కాకపోతే 8వ తేదీ కూడా రెడీగా ఉంచుకున్నారు. ప్రధాని ఓపెన్ చేశాక జూలై 8 నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకున్నారు. అయితే ఇపుడు జూలై 5వ తేదీ దగ్గర పడింది. దాంతో లాస్ట్ మినిట్ లో ఏమైనా జరిగితే తప్ప అయ్యేది కాదని అంటున్నారు. పోనీ 8వ తేదీ అవుతుందా అంటే దాని మీద కూడా ఇప్పటివరకూ క్లారిటీ అయితే లేదని చెబుతున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ దాటితే ఆషాడ మాసం వస్తుంది. ఆషాడం అంటే శూన్య మాసం. దాంతో నెల రోజుల వరకూ శుభ ముహూర్తాలు ఉండవని అంటున్నారు. మరో వైపు చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి జరుగుతున్నాయి. కనీసం నెల రోజుల పాటు అయినా ఈ సమావేశాలు జరుగుతాయని అంటున్నారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ :
ఇంకో వైపు చూస్తే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. దాంతో ఆ హడావుడి కూడా ఉంది. దాంతో బిజీగా కేంద్ర పెద్దలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టుని ప్రారంభించినా కూడా విశాఖ ఎయిర్ పోర్టుని కొనసాగించాలని చాలా మంది కోరుతున్నారు. ఎందుకంటే అరవై కిలోమీటర్ల దూరం అయితే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉంది. దాంతో కనెక్టివిటీ రోడ్లు అన్నవి కనుక తయారు అయ్యేంతవరకూ విశాఖ ఎయిర్ పోర్టునే వినియోగించాలని కోరుతున్నారు. దాంతో భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెన్ అయినా కాకపోయినా పెద్దగా తొందర అయితే ఎవరికీ లేదని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఆగస్టు 12 తరువాత శ్రావణ మాసంలో మళ్ళీ మంచి రోజులు ఉన్నాయని అంటున్నారు. అప్పటికి వర్షాకాల సమావేశాలు పూర్తి అయితే భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కి ప్రధాని రావచ్చు అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
