ఇదేం వెర్రి బాబోయ్: శ్మశానంలో టీ షాప్.. పిశాచాలా పేర్లతో మెనూ
పిచ్చ పీక్స కు చేరుకుంటోంది. రోటీన్ కు భిన్నంగా ఉండేలా చేయటం కోసం కొందరు చేస్తున్న అతికి వికారం కలిగే పరిస్థితి.
By: Garuda Media | 8 Feb 2026 10:02 AM ISTపిచ్చ పీక్స కు చేరుకుంటోంది. రోటీన్ కు భిన్నంగా ఉండేలా చేయటం కోసం కొందరు చేస్తున్న అతికి వికారం కలిగే పరిస్థితి. రోజురోజుకు అంతకంతకూ ముదిరిపోతున్న ఈ పిచ్చ చివరకు ఎక్కడికి వెళుతుందన్నది ప్రశ్నగా మారుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. సాధారణంగా టీస్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అన్న ప్రశ్నకు అందరూ ఇచ్చే సమాధానికి భిన్నంగా ట్రై చేశాడో తేడా కేసు. అవును.. తన టీ స్టాల్ ను ఏకంగా శ్మశానంలో ఏర్పాటు చేశాడు.
ఈ దరిద్రం గుజరాత్ లో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని హోంసోల్ ప్రాంతంలో భద్రేశ్వర్ శ్మశానవాటిక ఉంది. అందులో భయానక్ పేరుతో భయం కలిగించే పేరుతో ఒక టీ స్టాల్ ఓపెన్ చేవాడు అనిల్ బజరంగే ఛారా అనే కుర్రాడు. సాధారణంగా మాల్స్ లో హారర్ థీమ్ తో పార్కుల్ని ఏర్పాటు చేయటం.. డబ్బులు చెల్లించి మరీ భయపడే క్రేజీ థాట్ ను కాపీ కొట్టాడో ఏమో కానీ.. ఆ తరహాలోనే హారర్ థీమ్ తో టీస్టాల్ ఏర్పాటు చేశాడు.
ఇక.. టీస్టాల్ పేరే భయానక్ అన్న తర్వాత.. అందులో సర్వ్ చేసే వస్తువుల మెనూను ఇంకెత భయానకంగా తయారు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. తన మెనూను దెయ్యాల పేర్లతో సిద్ధం చేయటం గమనార్హం. షాపు యజమాని పేరు కూడా కాస్త సిత్రంగా.. రోటీన్ కు భిన్నంగా స్వర్గీయ అని పెట్టటంతో.. అక్కడకు వచ్చినోళ్లు విస్తుపోయే పరిస్థితి. డాక్టర్ కావాలని అనుకున్నా.. పేదరికంతో తన కలను నెరవేర్చుకోని ఈ కుర్రాడు.. తాను దెయ్యాన్ని కాదని.. మనిషిని అంటూ నవ్వేస్తుంటాడు.
బతికేందుకు ఏదో ఒకటి చేయాలని.. కానీ చేసేది రోటీన్ కు భిన్నంగా.. పిచ్చ క్రేజీగా ఉండాలని డిసైట్ అయిన అతను.. భూతం.. పిశాచాల పేర్లతో ఛాయ్ అందిస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు. తన డ్రెస్ ను సైతం దెయ్యం తరహాలో వేసుకోవటం ద్వారా.. విషయాన్ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. శాకిని చాయ్.. డాకిని కాఫీ లాంటి పేర్లతో మెనూ సిద్దం చేశారు. టీ.. కాఫీ తాగేసి వెళితే ఏం బాగుంటుందని.. శ్మశానంలో ఏర్పాటు చేసిన తన టీ స్టాల్ లో పుస్తకాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా నచ్చితే తాము కోరుకున్న టీ, కాఫీ తాగుతూ పుస్తకాన్ని చదువుకుంటూ ఎంతసేపైనా ఉండొచ్చని చెబుతున్నాడు. అయ్యగారి ఐడియా మామూలుగా లేదుగా.
