Begin typing your search above and press return to search.

భట్టి ఇంట భారీ వేడుక...రేవంత్ హాజరు

ఇక భట్టి నివాసం ఉంటున్న ప్రజా భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి కుమార్తె అల్లుడుతో సహా సకుటుంబ సమేతంగా హాజరై తన ఆప్యాయతను చాటుకున్నారు.

By:  Satya P   |   27 Nov 2025 9:14 AM IST
భట్టి ఇంట భారీ వేడుక...రేవంత్ హాజరు
X

తెలంగాణా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు కూడా. ఇదిలా ఉంటే ఆయన ఇంట ఒక శుభ వేడుక నిర్వహిస్తున్నారు. భట్టి విక్రమార్క కుమారుడు భట్టి విక్రమాదిత్య సాక్షిల వివాహ నిశ్చితార్ధ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు సినీ రాజకీయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు అంతా హాజరయ్యారు.

సకుటుంబ సమేతంగా :

ఇక భట్టి నివాసం ఉంటున్న ప్రజా భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి కుమార్తె అల్లుడుతో సహా సకుటుంబ సమేతంగా హాజరై తన ఆప్యాయతను చాటుకున్నారు. ఆయన వేదిక మీద భట్టి కుటుంబంతో కలసి సందడి చేశారు. సీఎం రావడంతో వేదిక అంతా కోలాహలంగా మారింది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ మంత్రులు అంతా హాజరయ్యారు. కోమటి వెంకట్ రెడ్డి శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, అజారుద్దీన్, వాకటి శ్రీహరి, సీతక్క కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌండ్ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు హాజరై కాంగ్రెస్ కుటుంబం వేడుకగా అనిపించారు.

వీఐపీలు అంతా :

అదే విధంగా టాలీవుడ్ నుంచి మెగా స్టార్ చిరంజీవి, బ్రహ్మానందం, టి సుబ్బరామిరెడ్డి, ఎంటీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, ఏబీఎన్ సీఎండీ రాధాక్రిష్ణ, రామోజీ గ్రూపుల నుంచి సీఎండీ కిరణ్, టీవీ 9 నుంచి మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, సీఎల్ రాజం తదితరులు అంతా వచ్చి నూతన వధూ వరులను దీవించారు. వీరితో పాటు గీతారెడ్డి, మధు యాష్కీ, పోచారం శ్రీనివాసరెడ్డి, లోక్ సభ రాజ్య సభ సభ్యులు అంతా హాజరయ్యారు. మొత్తానికి డిప్యూటీ సీఎం ఇంట ఆనంద వేడుకగా ఈ కార్యక్రమం సాగింది.