Begin typing your search above and press return to search.

వైసీపీ రాజ‌కీయాలు వైఎస్‌. 'భార‌తి' డీల్ చేయ‌గ‌ల‌రా.. ?

ఇదిలావుంటే.. ఇత‌ర రాష్ట్రాల్లో అయినా.. ఏపీలో అయినా.. రాజ‌కీయాల తీరు మారింది. ఢ‌క్కాముక్కీలు తిన్నవారే త‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారు.

By:  Garuda Media   |   23 Sept 2025 4:00 AM IST
వైసీపీ రాజ‌కీయాలు వైఎస్‌. భార‌తి డీల్ చేయ‌గ‌ల‌రా.. ?
X

తాజాగా ఓ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంపై రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ బాధ్య‌త‌ల‌ను ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. దీనికి సంబంధించి లోతైన చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌న్న‌ది ఆ క‌థ‌నం సారాంశం. ప్ర‌స్తుతం ముసురుకున్న ప‌లు కేసుల ప్ర‌భావంతో జ‌గ‌న్ త‌ప్ప‌ని ప‌రిస్థితిలో జైలుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని.. ఇదే జ‌రిగితే.. పార్టీని భార‌తి లీడ్ చేస్తార‌ని కూడా రాసుకొచ్చారు. అయితే.. నిజంగానే ఈ ప‌రిస్థితి వ‌స్తుందా? రాదా? అనేది ప‌క్క‌న పెడితే.. భార‌తికి డీల్ చేయ‌గ‌ల స‌త్తా ఉందా? అనేది కీల‌కం.

ఎందుకంటే.. వైఎస్ ఫ్యామిలీ నుంచి మ‌హిళ‌లు రాజ‌కీయాల‌లోకి రావ‌డం అనేది.. లేదు. కానీ, రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయితే.. వీరు పెద్ద‌గా స‌క్సెస్‌ క లేదు. సొంత పార్టీ పెట్టిన ష‌ర్మిల విఫ‌ల‌మ‌య్యారు. జాతీయ పార్టీని న‌డిపిస్తున్నా.. అనుకున్న రేంజ్‌లో అయితే గ్రాఫ్ పెర‌గ‌డం లేదు. ఇక‌, విజ‌య‌మ్మ గ‌త ఎన్నిక‌ల‌కుముందే.. అస్త్ర స‌న్యాసం చేశారు. ఇలా.. వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మ‌హిళ‌లు స‌క్సెస్ కాలేదు. పైగా ఆ ప్ర‌భావాన్ని కూడా అందుకోలేక పోయారు.

ఇక‌, ఇప్పుడు భార‌తి రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఏమేర‌కు పుంజుకుంటార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. విభిన్న మ‌న‌స్త త్వాలు ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను ఆమె ఏక‌తాటిపై న‌డిపించ‌డం.. ముందున్న అనేక స‌వాళ్ల‌ను జ‌యించ డం అనేది అంత ఈజీకాద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి బ‌లం ఎలా ఉన్నా.. వైసీపీ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌న్న‌ది వాస్త‌వం. గ‌తంలో చేసిన ప్ర‌యోగాలు విక‌టించాయి. పైగా.. కేసులు చుట్టు ముట్టాయి. క్షేత్ర‌స్థాయిలోనూ జెండా మోసే కార్య‌క‌ర్త‌ల సంఖ్య స‌గానికి స‌గం ప‌డిపోయింది. ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉన్న పార్టీని భార‌తి ఎలా న‌డిపించ‌గ‌ల‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఇదిలావుంటే.. ఇత‌ర రాష్ట్రాల్లో అయినా.. ఏపీలో అయినా.. రాజ‌కీయాల తీరు మారింది. ఢ‌క్కాముక్కీలు తిన్నవారే త‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సౌమ్యురాలిగా పేరున్న భార‌తి.. ప్ర‌స్తుత‌ము న్న రాజ‌కీయాల్లో త‌ట్టుకుని నిల‌బ‌డే స్థాయి లేద‌న్న‌ది వాస్త‌వం. పైగా.. రెడ్డి సామాజిక వ‌ర్గం మ‌హిళా నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకం అన్న‌ది తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గంలో త‌న హ‌వాను చాటుకునేందుకు భార‌తి ప్ర‌యాస ప‌డాల్సి రాక‌త‌ప్ప‌దు. ఇక‌, ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెంచుకోవాలంటే.. ఆమె కూడా పాద‌యాత్ర వంటిబ‌ల‌మైన కార్య‌క్ర‌మాల‌కు దిగాలి. సో.. ఇవ‌న్నీ.. ఆమె కు ఇప్పుడు సాధ్య‌మేనా అనేది ప్ర‌శ్న‌. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.