Begin typing your search above and press return to search.

మోడీ ‘భజన’మంత్రం పనిచేస్తుందా ?!

సాంప్రదాయ భక్తి గీతాలు, భజనలు, కీర్తనలకు ఆధునిక లైవ్ బ్యాండ్స్, లైటింగ్, కళ్లుచెదిరే వేదికలు, ఎలక్ట్రానిక్ బీట్స్ జోడించడం ఈ భజన్ క్లబ్బింగ్ ప్రత్యేకత.

By:  Garuda Media   |   26 Sept 2026 10:50 AM IST
మోడీ ‘భజన’మంత్రం పనిచేస్తుందా ?!
X

ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్ కత, అహ్మదాబాద్ నుండి అమెరికా వరకు వేగంగా వ్యాపిస్తున్న ‘భజన్ క్లబ్బింగ్స్’ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సాంప్రదాయ భక్తి గీతాలు, భజనలు, కీర్తనలకు ఆధునిక లైవ్ బ్యాండ్స్, లైటింగ్, కళ్లుచెదిరే వేదికలు, ఎలక్ట్రానిక్ బీట్స్ జోడించడం ఈ భజన్ క్లబ్బింగ్ ప్రత్యేకత.

న్యూఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్ లో నిర్వహించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కంజర వాయిస్తూ పాల్గొన్నారు. అనంతరం 130వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా సంస్కృతికి ఆత్మ. ఈరోజు యువత భక్తిని తమ జీవనశైలిలోకి తీసుకొచ్చింది. ఆధునిక యువతను ఆకట్టుకునే విధంగా ఇది ఉంది. భజనల గౌరవం, పవిత్రత కాపాడబడుతోంది. ఆధ్యాత్మికత, ఆధునికత అందంగా కలుస్తున్నాయి’ అని మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు.

అయితే భజన్ క్లబ్బింగ్స్ లో స్వయంగా మోడీ పాల్గొనడం మీద విమర్శలు వచ్చాయి. యువతను నిరుద్యోగం, ఇతర సమస్యల నుండి మళ్లించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మోడీ భజన వీడియో, ఢిల్లీలో మైనర్ బాలిక మీద జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనను ప్రస్తావిస్తూ మోడీ ప్రాధాన్యత దేనికి సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

ఈ భజన్ క్లబ్బింగ్స్ యువతకు సోషల్ కనెక్షన్స్, కమ్యూనిటీ ఫీలింగ్ తో పాటు మానసిక వత్తిడి తగ్గించడం, మద్యం, డ్రగ్స్ లేని అనుభవాలను పంచుతాయి. దాంతో పాటు సాంస్కృతిక మూలాలతో అనుసంధానం కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. అయితే అదే సమయంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, ఉపాధి అవకాశాలు, మహిళా భద్రత వంటి నిజమైన సమస్యలను పరిష్కారం కాదని అంటున్నారు.