Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి బిర్యానీలు.. ప్రైవేట్ పిక్స్.. మాజీ మొగుడి ‘సైకో’ లీలలు

సరిగ్గా ఇలాంటి ఓ ‘వెరైటీ’ సైకో మాజీ భర్త బాధితురాలైంది బెంగళూరుకు చెందిన ఓ మహిళ.

By:  A.N.Kumar   |   4 Aug 2026 11:52 AM IST
అర్ధరాత్రి బిర్యానీలు.. ప్రైవేట్ పిక్స్.. మాజీ మొగుడి ‘సైకో’ లీలలు
X

విడాకులు తీసుకున్నాక ఎవరి దారి వారు చూసుకుని.. ప్రశాంతంగా బ్రతికేద్దాం అనుకోవడం ఈ కాలంలో చాలా పెద్ద పొరపాటేమో.. పెళ్లి బంధం తెగిపోయినా.. పాత కక్షలను పట్టుకుని వేటాడే మాజీల వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా ఉండవు. సరిగ్గా ఇలాంటి ఓ ‘వెరైటీ’ సైకో మాజీ భర్త బాధితురాలైంది బెంగళూరుకు చెందిన ఓ మహిళ.

కథేంటంటే..

2013లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు కొన్నాళ్లకే ‘అన్యోన్యత’ ఎక్కువై కాపురంలో నిప్పులు పూసాయి. దీంతో విడాకులు తీసుకుని ఆ బంధానికి స్వస్తి చెప్పేసి 2022 నుంచి సదరు మహిళ బెంగళూరులో ప్రశాంతంగా ఒంటరిగా ఉంటోంది. అయితే మాజీ భర్తకు మాత్రం ఈ ప్రశాంతత అస్సలు నచ్చలేదు కాబోలు.. తన మాజీ భార్య డిస్టర్బ్ కాకుండా నిద్రపోతుంటే ఆయనగారికి నిద్రపట్టదేమో.. ఆట మొదలుపెట్టాడు.

వేధింపుల కొత్త ట్రెండ్

పాపం సదరు మాజీ భర్తగారు వేధించడానికి ఎంచుకున్న మార్గాలు చూస్తే జాలిపడాలో నవ్వాలో అర్థం కాదు. భార్య హాయిగా నిద్రపోయే అర్ధరాత్రి వేళల్లో.. డెలివరీ బాయ్స్‌తో తలుపు కొట్టించి ఫుడ్ ఆర్డర్లు పంపడం.. బహుశా "నేను తిండి తినిపించలేకపోయాను.. కనీసం డెలివరీ యాప్స్ అయినా తినిపించనీ" అని ఆరాటపడ్డాడేమో.. దాంతో ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో లీక్ చేస్తూ తన ‘సైబర్ శూరత్వాన్ని’ నిరూపించుకున్నాడు. ఫోన్లలో, ఆర్డర్లలో సరదా తీరక స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి రచ్చ చేయడం, దాడికి దిగడం లాంటి సాహసాలు కూడా చేశాడు.

చివరికి కథ కంచికేనా?

రోజూ అర్ధరాత్రి వచ్చే ఫుడ్ ఆర్డర్లతో, ఇంటర్నెట్ లీకులతో విసిగిపోయిన బాధితురాలు ఆఖరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సదరు సైకో మహానుభావుడి కోసం వేట మొదలుపెట్టారు.

సొంత తెలివితేటలను సరైన దారిలో వాడకుండా.. ఇలా మాజీ భార్యకు అర్ధరాత్రి బిర్యానీలు ఆర్డర్ చేస్తూ ఫొటోలు లీక్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్న ఈ 'మాజీ' గారికి పోలీసులు త్వరలోనే గట్టిగానే 'స్పెషల్ ట్రీట్' ఇచ్చేలా ఉన్నారు. మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఖాకీల లాఠీ ఎలా పలకరిస్తుందో ఈపాటికే ఆయనకు అర్థమై ఉండాలి.