టేబుల్ వద్దకు వస్తే స్క్రీన్ మారేలా వాటే ఐడియా బాస్
స్మార్ట్ ఫోన్ల రాకతో జీవనశైలి ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Garuda Media | 2 Feb 2026 10:08 AM ISTస్మార్ట్ ఫోన్ల రాకతో జీవనశైలి ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బోర్ కొడుతోందని.. ఎవరితోనైనా మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. గేమ్స్ మొదలుకొని.. సోషల్ మీడియా వరకు.. వాట్సాప్ నుంచి ఓటీటీలో సినిమాల వరకు నాన్ స్టాప్ గా ఎన్ని గంటలైనా తమకు తాము ఎంగేజ్ అయిపోవటం కామన్ గా మారింది. ఆ అలవాటు కాస్తా వర్కు ప్లేస్ లోనూ కంటిన్యూ అవుతున్న పరిస్థితి.
తమ అభిరుచులకు తగినట్లుగా పని మధ్యలో బ్రేకులు తీసుకోవటం.. తమకు నేచ్చిన గేమ్ కానీ ఓటీటీలో సిరీస్ కానీ సోషల్ మీడియాలో కబుర్లు కానీ.. వీడియోలు చూసుకుంటూ పనిని వాయిదా వేసే తీరు అంతకంతకూ ఎక్కువైంది. అదే సమయంలో బాస్ కంట పడి తిట్లు తినే ఉద్యోగుల సంఖ్య తక్కువేం కాదు. అయితే.. ఇలాంటి పరిస్థితిని తప్పించుకోవటానికి బెంగళూరుకు చెందిన ఒక టెకీకి వచ్చిన ఐడియా గురించి తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. ఇంతకూ అతనికి ఆ ఐడియా రావటానికి కారణం.. తనకు నచ్చిన గేమ్ ఆడుతూ బాస్ కంట పడి తిట్టించుకోవటమే.
ఇలా తిట్లు తినే పరిస్థితి రిపీట్ కాకుండా ఉండేందుకు అదిరే ఐడియాతో ఒక డివైజ్ ను తయారు చేశాడు. అదేమంటే.. తన కంప్యూటర్ కు ఏఐ వపర్డ్ కెమెరా డివైజ్ ను అమర్చాడు. ఆ కెమెరా పంకజ్ కూర్చున్న టేబుల్ పరిధిలో ఎవరు వచ్చినా గుర్తించటం.. ఆ వెంటనే కంప్యూటర్ స్క్రీన్ ఇన్ స్టంట్ గా కోడ్ ఎడిటర్ గా మారిపోతుంది. ఏఐ, ఆటోమేషన్, రియల్ టైమ్ ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీతో ఈ హార్డ్ వేర్ ను రూపొందించాడు.
తనకు వచ్చిన ఐడియాను ఎక్స్ లో పోస్టు చేశాడు. దీనికి లక్షలాది వ్యూస్ రావటమే కాదు.. వాటే ఐడియా బాస్ అంటూ మెచ్చుకుంటున్నారు. తన బాస్ తిట్ల దండకం నుంచి తప్పించుకోవటానికి ఈ హార్డ్ వేర్ డివైజ్ తయారు చేసినా.. ఆఫీసుల్లో ప్రైవసీని కాపాడేందుకు ఇదో స్మార్ట్ సొల్యూషన్ గా ఉపయోగపడుతుందని పంకజ్ చెబుతున్నాడు. ఏమైనా బుర్ర ఉన్నోడి ఆలోచనలు ఎలా ఉంటాయనటానికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు.
