Begin typing your search above and press return to search.

సంసారానికి పనికిరాని భర్త.. రూ.2 కోట్లుడిమాండ్ చేసిన భార్య.. అదిరిపోయే షాక్

బెంగళూరులో ఓ వివాహిత భర్తపై చేసిన వింత ఆరోపణలు, అనంతరం కోరిన రూ.2 కోట్ల పరిహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   24 Sept 2025 10:46 AM IST
సంసారానికి పనికిరాని భర్త.. రూ.2 కోట్లుడిమాండ్ చేసిన భార్య.. అదిరిపోయే షాక్
X

బెంగళూరులో ఓ వివాహిత భర్తపై చేసిన వింత ఆరోపణలు, అనంతరం కోరిన రూ.2 కోట్ల పరిహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పెళ్లైన మూడు నెలలకే భర్త 'సంసారానికి పనికిరాడు' అని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం, తరువాత అతడిపై దాడికి పాల్పడటం ఈ కేసులో ప్రధాన అంశాలు. ఈ ఘటనకు సంబంధించి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ ప్రారంభమైంది.

సంఘటన వివరాలు:

బెంగళూరులోని గోవిందరాజ్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఈ ఏడాది మే 5న 29 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సప్తగిరి ప్యాలెస్‌లో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే, పెళ్లయిన మూడు నెలలకే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య తన భర్తతో శారీరక సంబంధం పెట్టుకోలేదని, అతడికి నపుంసకత్వం ఉందని ఆరోపణలు చేసింది.

వైద్య పరీక్షలు

భార్య ఒత్తిడితో భర్త వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అయితే, వైద్య నివేదికలో అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. డాక్టర్ల నివేదికను భార్య పట్టించుకోకుండా, తన ఆరోపణలపై నిలదీస్తూనే ఉంది.

రూ.2 కోట్ల డిమాండ్

భర్త తనతో సంసారంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ ఆమె రూ.2 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసింది. అంతేకాక గత నెల 17న ఆమె తన బంధువులతో కలిసి గోవిందరాజ్‌నగర్‌లోని భర్త ఇంటికి వచ్చి అతడిని, అతడి కుటుంబ సభ్యులను దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల చర్య

భర్త ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భార్యపై వేధింపులు, దాడి కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

బీజేపీ మీడియా విభాగంలో భార్య

బాధితుడు మాట్లాడుతూ తన భార్య బీజేపీ మీడియా విభాగంలో పనిచేస్తుందని, ఈ కేసులో తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ కేసు బెంగళూరులో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. భార్య యొక్క డిమాండ్లు, భర్త ఆరోపణలు.. దాని వెనుక ఉన్న కారణాలు ఈ కేసును మరింత జటిలం చేశాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతి గురించి మరిన్ని వివరాలు ఇంకా వెలువడలేదు. న్యాయ నిపుణులు ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్నారు.