Begin typing your search above and press return to search.

వరల్డ్ టెక్ సిటీస్ లో బెంగళూరు ప్లేస్ ఎక్కడంటే ?

ఈ దేశంలో టెక్ సిటీస్ గా చాలా అభివృద్ధి చెందాయి. అయితే ఇండియాలో చూస్తే కనుక బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందింది.

By:  Satya P   |   9 Dec 2025 8:56 AM IST
వరల్డ్ టెక్ సిటీస్ లో బెంగళూరు ప్లేస్ ఎక్కడంటే ?
X

ఈ దేశంలో టెక్ సిటీస్ గా చాలా అభివృద్ధి చెందాయి. అయితే ఇండియాలో చూస్తే కనుక బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందింది. దానికి కారణం వరల్డ్ వైడ్ గా టెక్ సిటీకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ బెంగళూరు కి ఉన్నాయి. అంతే కాదు రాను రానూ తన ప్రాముఖ్యతను మరింతగా పెంచుకుంటూ పోతోంది. తగిన వాతావరణ పరిస్థితులతో పాటు మౌలిక సదుపాయాలు టెక్ ఎకో సిస్టం బెంగళూర్ ని ఆ విధంగా నిలబెట్టాయని చెప్పాలి.

గ్లోబల్ టెక్ సిటీస్ లిస్ట్ :

ఇక ప్రపంచంలోనే టెక్నాలజీ కేంద్రాలుగా ఉన్న మహా నగరాల జాబితా వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్న ర్యాంకులను కనుక చూస్తే బెంగళూరు ఏకంగా 16వ ప్లేస్ లోకి ఎగబాకింది. గతంలో ఉన్న ప్లేస్ లో నుంచి బెంగళూరు ఇపుడు సగానికి సగం పైగా ముందుకు రావడం అంటే గ్రేట్ అని చెప్పాలి. అంతే కాదు వరల్డ్ వైడ్ టాప్ 30 జాబితాలో బెంగళూరు ఉండడం విశేషం. ఈ వివరాలను ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ శావిల్స్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించిబంది. ఈ పరిణామతో వరల్డ్ వైడ్ గా ఆసియా మార్కెట్లపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోకస్ ఇంట్రెస్ట్ కి ఒక బలమైన ఉదాహరణగా చెబుతున్నారు.

అగ్ర భాగాన ఆ సిటీస్ :

ఇక ఎప్పటిలాగానే వరల్డ్ వైడ్ గా చూస్తే టాప్ టెన్ లో టాప్ ఫైవ్ లో కూడా అగ్ర భాగాన ఉన్న టెక్ సిటీస్ గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అయితే వాటి ప్లేస్ అలా ఉన్నా దేశంలోనే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా తనకు ఉన్న ఘనతను బెంగళూరు మరోసారి చాటుకుంది అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే బెంగళూర్ టెక్నాలజీలో ప్రతిభావంతులకు కీలక కేంద్రంగా మారింది అని అంటున్నారు. రాను రానూ బెంగళూరు ప్రాముఖ్యత పెరుగుతోంది కానీ తగ్గడం లేదు అని అంటున్నారు. దానికి కారణం ఎంతో బలమైన టెక్ ఎకోసిస్టమ్స్ ఇక్కడ నానాటికిఈ అభివృద్ధి చెందుతూ పోవడమే కారణంగా చెబుతున్నారు.

మరింతగా ముందుకు :

ఈ తాజా జాబితాలో బెంగళూరు ప్లేస్ ఇలా ఉంటే రానున్న కాలంలో ఇంకా ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని శావిల్స్ ఇండియా రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ నందన్ గట్టిగా చెబుతున్నారు. ప్రపంచంలో చూస్తే కనుక గ్లోబల్ టెక్ సిటీస్ గా ఉన్న వాటి అన్నింటికీ ఒక సారూప్యం ఉంది, అక్కడ అద్భుతమైన వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక జీవనం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉంటాయి. అలాంటి వాటిలో బెంగళూరు కచ్చితంగా ముందునే ఉంది కాబట్టి ఇంకా తన ప్లేస్ ని స్ట్రాంగ్ చేసుకుంటుందని అంటున్నారు. ఇక ఈ ర్యాంకులు ఎలా ఇస్తారు అంటే కనుక అక్కడి వ్యాపార వాతావరణం, ప్రతిభ కలిగిన మానవ వనరులు, సాంకేతిక బలం, జీవన ప్రమాణాలు వంటి వంద అంశాల ఆధారంగా ప్రపంచంలోని నగరాలకు ఈ ర్యాంకులను ఇస్తూంటారు.