ట్రెండింగ్ పేరుతో మళ్లీ తిరిగొస్తున్న ఆ రోజులు!
సాధారణంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటప్పుడు అందరూ మాస్టర్ బెడ్‌రూమ్ ఎలా ఉంది, బాల్కనీలో నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది అని చూస్తారు.
By: Madhu Reddy | 22 Jun 2026 3:00 PM ISTసాధారణంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటప్పుడు అందరూ మాస్టర్ బెడ్‌రూమ్ ఎలా ఉంది, బాల్కనీలో నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది అని చూస్తారు. కానీ బెంగళూరులోని ఒక ఫ్లాట్ మాత్రం అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎందుకంటే, అక్కడ వెరైటీ గా బాల్కనీలోనే వెస్ట్రన్ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.
బాల్కనీ డోర్ తీస్తే ఊహించని సర్ప్రైజ్:
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ ఫ్లాట్ లోపల నడుచుకుంటూ వెళ్లి బాల్కనీ డోర్ తెరుస్తుంది. చుట్టూ గ్రిల్స్, నెట్లు, చక్కటి గాలి, వెలుతురుతో ఆ బాల్కనీ ఎంతో బాగుంటుంది. కానీ, సరిగ్గా అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది! ఆ ఓపెన్ బాల్కనీలోనే ఒక వెస్ట్రన్ కమోడ్, ఫ్లష్ ట్యాంక్, జెట్ స్ప్రేలను బిగించి ఉంచారు. "బాల్కనీలో ఏముందో చూసేవరకు ఆగండి" అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో చూసి జనాలు నవ్వుకోవాలో, ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
పాత కాలపు పద్ధతి గుర్తొస్తోంది:
పూర్వం పల్లెటూళ్లలో ఇళ్లకు దూరంగా, పెరట్లో బాత్‌రూమ్‌లు కట్టేవారు. మళ్లీ ఇప్పుడు బెంగళూరు ఫ్లాట్‌లో బాల్కనీ చివర ఇలా టాయిలెట్ పెట్టడం చూస్తుంటే అదే గుర్తొస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి వింత లేఅవుట్ ఉండటం మాత్రం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు:
ఈ వీడియోపై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఒక యూజర్ స్పందిస్తూ.. "ఉదయాన్నే స్మోకింగ్ చేస్తూ టాయిలెట్‌కు వెళ్లే అలవాటు ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్" అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ఇక మరో నెటిజన్ ఐదో అంతస్తులో ఓపెన్ బాల్కనీలోనే ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ.. "దీన్ని మీరు అస్సలు ఊహించి ఉండరు" అంటూ పోస్ట్ పెట్టారు.
బెంగళూరులో ఇళ్ల అద్దెలు, ఫ్లాట్ల రేట్లు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఎంత రేట్లు పెరిగితే మాత్రం ఇలా బాల్కనీలోనే టాయిలెట్ కట్టేస్తారా? అంటూ జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ టాయిలెట్ వాడుకునే ఈ వింత ఐడియా నిజంగానే సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది..
