Begin typing your search above and press return to search.

లగేజ్ తెరిచినట్లు లేదు.. బంగారం..వజ్రాలు మాయం

వారి లగేజ్ లో 790 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8లక్షల విలువైన వజ్రాభరణాలు.. అమెరికన్ డాలర్లు ఉన్నట్లుగా వారు పేర్కొంటున్నారు.

By:  Garuda Media   |   4 Feb 2026 6:59 PM IST
లగేజ్ తెరిచినట్లు లేదు.. బంగారం..వజ్రాలు మాయం
X

అమెరికాకు చెందిన ఓ పెద్దావిడకు ఎదురైన షాకింగ్ ఉదంతం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. విమాన ప్రయాణంలో ఆమె చెక్ ఇన్ చేసిన లగేజ్ లో పెద్ద ఎత్తున బంగారం.. వజ్రాలు.. డాలర్లు ఉంచటం.. సూట్ కేస్ తీసినట్లుగా కానీ డ్యామేజ్ అయినట్లుగా కానీ లేదు. కానీ.. అందులో ఉండాల్సిన విలువైన సామాగ్రి కనిపించకుండా పోవటం ఆమెను అవాక్కు అయ్యేలా చేసింది.

తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ధార్వాడ్ కు చెందిన 62 ఏళ్ల శాంత రమేశ్ కుటుంబ సభ్యులు గత ఏడాది నవంబరు 15న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లారు. బెంగళూరు నుంచి ఆకాశ్ ఎయిర్ లైన్స్ లో అబుదాబికి చేరారు.

బెంగళూరు ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ కౌంటర్ లో అన్ని పత్రాలను ధ్రువీకరించిన తర్వాతే తమ లగేజ్ ను అప్పగించారు. వారు అబుదాబి ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత తమ లగేజ్ లోని విలువైన వస్తువులు పోయినట్లుగా గుర్తించారు. దీంతో.. వారు షాక్ తిన్నారు.దీనికి కారణం.. వారి లగేజ్ ఎలాంటి డ్యామేజ్ కు గురి కాలేదు. కానీ.. విలువైన వస్తువులు మాయం కావటం విస్మయానికి గురి చేసింది.

వారి లగేజ్ లో 790 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8లక్షల విలువైన వజ్రాభరణాలు.. అమెరికన్ డాలర్లు ఉన్నట్లుగా వారు పేర్కొంటున్నారు. వెంటనే.. వారు అబుదాబి అధికారులకు.. ఆకాష్ ఎయిర్ లైన్స్ కు ఫిర్యాదు చేశారు. అయితే.. వారి నుంచి సరైన స్పందన రాలేదన్నది వారి ఆరోపణ. అనంతరం వారు ఈ ఏడాది జనవరి ఏడున బెంగళూరకు తిరిగి వచ్చారు. మిస్ అయిన తమ విలువైన ఆభరణాల కోసం వారు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

దీంతో వారు తాజాగా కర్ణాటక పోలీసుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బెంగళూరు విమానాశ్రయ పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. భద్రతా సిబ్బందిని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు మొదలు పెట్టారు. విలువైన ఆభరణాల మిస్సింగ్ ఇప్పుడో మిస్టరీగా మారింది.