Begin typing your search above and press return to search.

కొత్త రికార్డు క్రియేట్ చేసిన సోనియా 'బిలాంగింగ్‌'

సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి పాఠకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రెండు లక్షల కాపీలు అమ్ముడైనట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ప్రకటించింది. 550 పేజీల ఈ పుస్తకంలో సోనియా జీవితంలోని కీలక ఘట్టాలు, రాజీవ్ గాంధీ హత్య, రాజకీయాల్లోకి ప్రవేశం, ప్రధాని పదవిని తిరస్కరించిన అంశాలను ప్రస్తావించారు.

By:  Satya P   |   17 Nov 2026 12:34 AM IST
కొత్త రికార్డు క్రియేట్ చేసిన సోనియా బిలాంగింగ్‌
X

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తమ ఆత్మ కధగా రాసిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకానికి పాఠక లోకం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో ఈ పుస్తకం రిలీజ్ అయి వారం కూడా తిరగకుండానే ఏకంగా రెండు లక్షల పుస్తకాలు అమ్ముడుపోయాయి. అలా సరికొత్త రికార్డును ఈ బుక్ క్రియేట్ చేసింది అని అంటున్నారు. సాహిత్య కారులు ప్రసిద్ధ రచయితలు రాసిన పుస్తకాలే అమ్ముడు పోవడానికి ఎంత వ్యయ ప్రయాసలకు పడుతున్న ఈ రోజులలో సోనియా గాంధీ పుస్తకానికి ఇంత డిమాండ్ రావడం అంటే ఆమెకు రాజకీయంగా ఉన్న ఇమేజ్ తో పాటు గాంధీ ఫ్యామిలీ మీద జనాలకు ఉన్న ఆసక్తి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

కీలక ఘట్టాలతో :

ఈ పుస్తకం ఆత్మ కధగా చెప్పుకున్నా సోనియా గాంధీ తన జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందించారు. అందులో ఆమె జ్యాపకాలు వాటిని అల్లుకుని ఉన్న సందర్భాలతోనే ఈ పుస్తకం సాగిపోతుంది. 550 పేజీలతో ఏడు భాగాలుగా అందులో 37 ఉప భాగాలుగా ఉన్న ఈ భారీ పుస్తకం సోనియా రాయడం వల్లనే ఇంతటి ప్రసిద్ధి చెందింది అని అంటున్నారు. అందుకే ఈ బుక్ ని ప్రచురించిన సంస్థ హార్పర్‌కాలిన్స్‌ భారీ ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయని ప్రకటిచింది. ఇదిలా ఉంటే సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో సోనియా గాంధీ ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించడం జరిగింది.

ప్రధాని పదవి వద్దు :

అసలు ప్రధాని పదవిని సోనియా గాంధీ ఎందుకు వద్దు అన్నారు అన్నది పాతికేళ్ళు అవుతున్నా జనాలకు తెలియని విషయం. అందుకు సమాధానం కోసం ఈ పుస్తకం చాలా మంది కొని మరీ చదివారు. అలాగే సోనియా గాంధీ జీవితం ఇటలీలో మొదలై ఇండియా చేరుకుని ఆమె విదేశీ వనిత నుంచి స్వదేశీ వనితగా ఎలా మారారు, ఆమె జీవితంలో ఎన్నో మలుపులు అలాగే తాను ఎంతో ప్రేమించిన రాజీవ్ గాంధీ నడి వయసులో దారుణ హత్యకు గురి కావడం, ఇష్టం లేని రాజకీయాల్లోకి ఆమె బలవంతంగా రావడం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా పదవిని నిర్వహించడం ఇవన్నీ ఆసక్తిని పెంచే అంశాలు అని అంటున్నారు.

అతిరథ మహారథుల మధ్య :

ఇదిలా ఉంటే సోనియా గాంధీ తన ఆత్మ కధ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని అతిరథ మహారధులు మధ్యలో ఆవిష్కరించారు. ఇండియా కూటమిలోని ప్రముఖులు ముఖ్యమంత్రులు అంతా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, సీనియర్‌ నాయకులు అఖిలేశ్‌ యాదవ్‌, సుప్రియా సూలే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భార్య గురుశరణ్‌ కౌర్‌, బీజేపీ నేత అమరీందర్‌ సింగ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ బెనర్జీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు ఈ కార్యక్రమానికి రావడం ద్వారా సోనియా గాంధీ పట్ల తమ అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నారు.