ఆమెను అలా సేవ్ చేసిన ట్రంప్ తనయుడు..ఏం జరిగిందంటే?
గత ఏడాది అమెరికాలో ఉన్న బారెన్ ట్రంప్.. యూకేలోని ఒక యువతితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు.
By: Garuda Media | 29 March 2026 10:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ఒక మహిళను కాపాడిన వైనం వెలుగు చూసింది. అంతేకాదు.. సరైన సమయంలో స్పందించి.. దేశం కాని దేశంలోని అత్యవసర విభాగానికి ఫోన్ చేసి..అక్కడి అధికారుల్ని అప్రమత్తం చేసిన కారణంగా ఆమె ప్రాణాలు నిలిచిన పరిస్థితి. కేవలం ట్రంప్ తనయుడితో స్నేహం చేస్తున్నారన్న కారణంగా ఆసూయతో ఒక మహిళపై ఆమె బాయ్ ఫ్రెండ్ దాడికి దిగటం..ఆ విషయాన్ని గుర్తించిన ట్రంప్ తనయుడు వెంటనే స్పందించి ఆమెను సేవ్ చేశారు.తాజాగా లండన్ కోర్టు ట్రంప్ తనయుడ్ని మెచ్చుకోవటంతో ఈ విషయం వెలుగు చూసింది.
గత ఏడాది అమెరికాలో ఉన్న బారెన్ ట్రంప్.. యూకేలోని ఒక యువతితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఆసూయతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే..స్పందించిన బారెన్ ట్రంప్..యూకే అత్యవసర విభాగానికి ఫోన్ చేశాడు. తన స్నేహితురాలిపై జరుగుతున్న దాడి గురించి వారికి సమాచారం ఇచ్చాడు. ఈ సందర్భంగా సదరు అధికారులు..మీరెవరు?అని అడగ్గా..అది అప్రస్తుతమని..వెంటనే ఆమెను రక్షించాలని కోరారు.
అయితే.. సదరు ఆపరేటర్ ఆమె మీకు ఎలా తెలుసు? అని అడగ్గా.. తనకు ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమని చెప్పటం..అనంతరం అధికారులు స్పందించిన ఆమెను రక్షించారు. ఈ ఉదంతానికి సంబంధించి.. బాధిత యువతి బాయ్ ఫ్రెండ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి..ట్రంప్ తనయుడ్ని ప్రశంసించటమే కాదు.. బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు.
‘‘బారెన్ ట్రంప్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అమెరికాలో ఉన్నప్పటికి యూకేలోని అత్యవసర సేవలకు కాల్ చేశారు.తాను చూసింది చెప్పారు. బారెన్ ట్రంప్ ఫోన్ కాల్ వల్లే ఆమె ప్రాణాలు నిలిచాయి’’అని న్యాయమూర్తి ప్రశంసించారు. దాడి చేసిన యువకుడికి నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చారు న్యాయస్థానం. ఏమైనా..ఇలాంటి ఉదంతాల్లో ప్రముఖులు తమ ఉనికి ప్రపంచానికి తెలిసేందుకుఅస్సలు ఇష్టపడరు. ఇక్కడ.. తనకున్న పేరు ప్రఖ్యాతులు..తన ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందా?అనే కన్నా.. ప్రమాదంలో ఉన్న మహిళను కాపాడాలన్న ఆలోచన గొప్పదిగా చెప్పకతప్పదు.
