నువ్వా-నేనా అనే రేంజ్‌లో.. బాపట్ల జడ్పీటీసీ..!
మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా సమీక్షలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
By: Garuda Media | 27 Oct 2026 3:00 PM ISTబాపట్ల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోరు అత్యంత రసవత్తరంగా మారింది. నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా.. జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానం మహిళ (జనరల్) కేటగిరీకి రిజర్వ్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడిగా రంగంలోకి దిగారు.
మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా సమీక్షలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గత 2021 పరిషత్ ఎన్నికల్లో నాటి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని బాపట్ల మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఈసారి కూడా స్థానిక పట్టును నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి వంటి కీలక నేతల ఆధ్వర్యంలో పార్టీ గట్టి పోటీని ఇస్తోంది. ఇక, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి వంటి స్థానాల్లో వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసి త్రిముఖ పోరుకు ప్రయత్నిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియలో ప్రధానంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు కుదిరినప్పటికీ, ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కొన్ని స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని బుజ్జగించేం దుకు కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారురు, రెబల్స్ బరిలో ఉంటే అధికారిక అభ్యర్థుల ఓట్లకు గండిపడే ప్రమాదం ఉంది. అయితే.. కొందరు వెనక్కి తగ్గినా.. మరింత మంది మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు స్థానిక అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ మార్గాలను అన్వే షిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకూడదని ఆంక్షలు విధిం చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒప్పందాలు, రాయబారాలు జోరుగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల్లో తటస్థ ఓటరును ఆకట్టుకునేందుకు ప్రయత్నాలుముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఎవరూ వెనక్కి తగ్గకుండా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు
