స్వదేశానికి చీకటి యువరాజు.. భారత్ కు ఇది శుభవార్త ఎలా..!
బంగ్లాదేశ్ గత కొన్ని రోజులుగా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. పైగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండటం.. ఆ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పాల్గొనకుండా నిషేదాన్ని ఎదుర్కోవడం..
By: Raja Ch | 25 Dec 2025 10:00 PM ISTబంగ్లాదేశ్ గత కొన్ని రోజులుగా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. పైగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండటం.. ఆ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పాల్గొనకుండా నిషేదాన్ని ఎదుర్కోవడం.. మరోవైపు పాకిస్థాన్ కు చెందిన ఐ.ఎస్.ఐ. తో సన్నిహిత సంబంధాలు ఉన్న జమాత్-ఇ-ఇస్లామీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం.. ఇటీవల జరిగిన ఢాకా యూనివర్సిటీ ఎన్నికల్లో ఆ పాటీ విజయం సాధించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశాలనే చెప్పొచ్చు.
మరోవైపు భారత్ తో కొద్దో గొప్పో సఖ్యతగా నడుచూనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) అధినేత్రి, మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన పరిస్థితి. ఈ సమయంలో స్వీయ ప్రవాసమో, స్వీయ భహిష్కరనో తెలియదు కానీ.. సుమారు 17 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, ఒకప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో "చీకటి యువరాజు"గా పరిగణించబడే తారిక్ రెహమాన్ లక్షలాది ప్రజల ఘన స్వాగతం నడుమ స్వదేశంలోకి అడుగుపెట్టారు.
అవును... ఇంతకాలం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) పోస్టర్లలో అతని ముఖం కనిపించింది కానీ.. అతడి గొంతు ఎవరికీ వినిపించలేదు. అయితే... భారతదేశ ప్రాంతీయ భద్రతకు కీలకమైన ఫిబ్రారిలో జరిగే ఎన్నికలకు కొన్ని వారాల ముందు.. హింసతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్, బీ.ఎన్.పీ కి తాజాగా ఓ నిర్ణయత్మక క్షణం ఆవిర్భవించింది. తారిఖ్ రెహమాన్ ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇది ఒక రకంగా భారత్ కు శుభవార్తే అని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి ఇటీవల జరిగిన పలు సర్వే ఫలితాలు.. బంగ్లాదేశ్ లో బీ.ఎన్.పీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. మరోవైపు.. ఒకప్పుడు బీ.ఎన్.పీకి మిత్రపక్షంగా ఉన్న జమాత్ నెక్స్ట్ ప్లేస్ లో ఉంది. మరోవైపు ఢాకా యూనివర్సిటీ ఎన్నికల్లో జమాత్ స్టూడెంట్ వింగ్ విజయం సాధించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఆశ్చర్యకరమైన విజయం భారత్ లోనూ తీవ్ర ఉత్కంఠను రేపిందని అంటున్నారు. ఇది బంగ్లా ప్రజల నాడా అనే చర్చా తెరపైకి వచ్చింది!
కాగా... హసీనా నాయకత్వంలో భారతదేశంతో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. పాకిస్తాన్ నుండి సురక్షితమైన దూరాన్ని హసీనా కొనసాగించారు. అయితే.. ఆమె తదనంతరం బంగ్లాదేశ్ ను భారతదేశం నుండి దూరం చేయడం ద్వారా పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాల కోసం ఒత్తిడి చేసిన యూనస్ నాయకత్వంలో పరిస్థితి మలుపు తిరిగింది. ఈ సమయంలో యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో విభేదాలున్న రెహమాన్ ఇప్పుడు రంగంలోకి దిగారు!
ఇది భారత్ కు శుభసూచికం అని అంటున్నారు. పాకిస్థాన్ తో రాసుకు పూసుకు తిరుగుతున్న యూనస్ ను బీ.ఎన్.పీకి చెందిన రెహమాన్ విభేధించడంతో పాటు జమాత్ ను కూడా విమర్శించడం.. వారితో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడం శుభసూచికమని అంటున్నారు. కాగా.. డిసెంబర్ 1న తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదా జియాకు భారత ప్రధాని మోడీ మద్దతు ప్రకటిస్తూ, ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే!
