Begin typing your search above and press return to search.

హాదీ హత్య కేసులో బంగ్లా ఆరోపణలన్నీ గాలి కబుర్లు... వీడియో వైరల్!

అవును... డిసెంబర్ 12న హాదిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అతడిని మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

By:  Raja Ch   |   31 Dec 2025 3:28 PM IST
హాదీ హత్య కేసులో బంగ్లా ఆరోపణలన్నీ గాలి కబుర్లు... వీడియో వైరల్!
X

బంగ్లాదేశ్ లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో బంగ్లాదేశ్ నుంచి వినిపిస్తోన్న ఆరోపణలన్నీ గాలి కబుర్లు అనే అభిప్రాయానికి బలం చేకూర్చే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హాదీ హత్యతో సంబంధం ఉన్న వారిని పట్టుకోలేకో.. లేక, అందుకు కొన్ని శక్తులు అడ్డు వచ్చో తెలియదు కానీ.. ఈ కేసుపై బంగ్లా కేవలం గాలి ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బంగ్లాకు షాకిచ్చే వీడియో తెరపైకి వచ్చింది.

అవును... డిసెంబర్ 12న హాదిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అతడిని మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో అంతర్గత అల్లర్లు విపరీతంగా చెలరేగిపోయాయి. ఈ నేపథ్యంలో.. కరీమ్ మసూద్, అలంగీర్ షేక్ బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. అనంతరం.. వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారని, హలువాఘాట్ సరిహద్దు మీదుగా భారతదేశానికి చేరుకున్నారని ఆరోపించారు.

అదిగో పులి ఈంటే ఇదిగో తోక అన్నట్లుగా.. ఈ ఢాకా పోలీసుల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న విద్యార్థి నేతలు.. 24 గంటల్లో వారిని భారత్ నుంచి రప్పించాలని యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమెటం జారీచేశారు. మరోవైపు ఈ ఆరోపణలను భారత్ కొట్టి పారేసింది. బంగ్లా నుంచి భారత్ లోకి ఎవరూ ప్రవేశించలేదని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తేల్చి చెప్పింది. ఈ సమయంలో తాను దుబాయ్ లో ఉన్నానంటూ ఫైసల్ కరీమ్ మసూద్ వెల్లడించాడు.

ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో... తాను హాదీని చంపలేదని.. తనను, తన కుటుంబాన్ని కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని.. దీని నుంచి తనను తాను రక్షంచుకోవడానికే దుబాయ్ కి వెళ్లినట్లు తెలిపాడు. ఇదే సమయంలో.. జమాతే ఇస్లామీ పార్టీ వ్యక్తి హాదీ అని.. ఈ సమయంలో ఆ పార్టీ విధ్యార్థి విభాగానికి చెందిన వారు ఈ హత్య వెనుక ఉండి ఉండొచ్చని.. తనకు హాదీతో వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు!

ఇదే సమయంలో.. ఓ ఐటీ సంస్థ యజమానిగా వృత్తిపరమైన కారణాల వల్ల తాను హాదీని కలిసిన మాట వాస్తవమే కానీ.. అది ప్రభుత్వ కాంట్రాక్టుల వాగ్దానాల కోసం కాదని.. అతను కోరిన మేరకు రాజకీయ విరాళాలు ఇచ్చానని ఫైసల్ తెలిపాడు.

కాగా... డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ప్రచార యాత్రలో ఉండగా పట్టపగలు సమయంలోనే హాదిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో అతని తలలోకి తుపాకీ తూటా దూసుకుపోయిందని కథనాలొచ్చాయి. ఈ సమయంలో మెరుగైన వైద్యం కోసం అతన్ని సింగపూర్ పంపగా.. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 18న హాదీ మరణించాడు. దీంతో.. బంగ్లాదేశ్ అంతటా అల్లర్లు చెలరేగాయి.. హిందువులపై దాడులు జరిగాయి.

ఈ సమయంలో... హాదీ హత్యకేసులో అనుమానితులు దేశం విడిచి పారిపోయారని.. వారు హలువాఘాట్ సరిహద్దు మీదుగా భారతదేశానికి చేరుకున్నారని.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఆరోపించారు. అయితే, ఆ వాదనలను భారత భద్రతా అధికారులు తోసిపుచ్చారు.. అటువంటి సరిహద్దు కదలికల నివేదికలను ఆధారాలు లేనివిగా తోసిపుచ్చారు. ఈ క్రమంలో తాను దుబాయ్ లో ఉన్నానని ఆ అనుమానితుల్లో ఒకరు తెలిపారు. దీంతో ఢాకా పోలీసులు భారత్ లక్ష్యంగా చేసిన ఆరోపణలు పూర్తిగా గాలి కబుర్లనే కామెట్లు వినిపిస్తున్నాయి!