Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ లో హిందూ, క్రిస్టియన్ల పరిస్థితి ఇది... షాకింగ్ ఘటనలు!

ఈ క్రమంలో తాజాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ క్రైస్తవ యువతిపై అల్లరి మూక అవమానవీయంగా ప్రవర్తించింది.

By:  Raja Ch   |   19 Dec 2025 3:36 PM IST
బంగ్లాదేశ్  లో హిందూ, క్రిస్టియన్ల పరిస్థితి ఇది... షాకింగ్  ఘటనలు!
X

బంగ్లాదేశ్ తగలబడిపోతున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగిన విద్యార్థి తిరుగుబాటు సమయంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న షరీఫ్ ఉస్మాన్ హైది మరణించాడనే ప్రకటన అనంతరం ఢాకాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మాటున పలువురు మూకలు మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులు లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పలు ఘటనలు తెరపైకి వచ్చాయి.

అవును... బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులు, క్రైస్తవులు లక్ష్యంగా అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ క్రైస్తవ యువతిపై అల్లరి మూక అవమానవీయంగా ప్రవర్తించింది. ఇందులో భాగంగా... ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టిన అల్లరి మూక ఆమెను కాళ్లతో తన్నుతూ, దాడి చేసింది. హిజాబ్ ధరిచలేదనే కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

మరోవైపు.. దైవదుషణ చేశాడనే ఆరోపణలపై బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే ఒక హిందువుని గురువారం రాత్రి కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి, నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటున సంఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకోసం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ స్పందించింది. ఈ హత్యను ఖండిస్తూ.. ఇది బంగ్లాదేశ్ లోని దీపు చంద్రదాస్ గురించి మాత్రమే కాదని.. పశ్చిమ బెంగాల్ లోని మమత పాలనలో అదే విధిని ఎదుర్కొన్న హరగోవిందో దాస్, చందన్ దాస్ గురించి కూడా అని చెబుతూ.. వెస్ట్ బెంగాలోని మమత పాలనలో అయినా, బంగ్లాదేశ్ లోని యూనస్ పాలనలో అయినా.. వారు హిందువు కాబట్టి చంపబడ్డారంటూ తనదైన శైలిలో స్పందించింది.

స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం!:

ఇలా బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న ఘోర ఘటనలపై యూనస్ నేతృతంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా మైమెన్ సింగ్ లో ఓ హిందూ వ్యక్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. న్యూ బంగ్లాదేశ్ గా అభివర్ణించిన దేశంలో మత విద్వేషానికి చోటు లేదని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో.. దోషులను ఎవరినీ వదిలిపెట్టబోమని నొక్కి చెప్పింది.

ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కు సెక్యూరిటీ!:

ఓ పక్క బంగ్లాదేశ్ లో భారత్ హైకమిషన్ పై అటాక్ చేయడానికి ప్రయత్నాలు జరగడం, బెదిరింపులు రావడం.. హిందువులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల భద్రతను పెంచారు. బంగ్లా మిషన్ చుట్టూ భద్రతా వలయాన్ని బలోపేతం చేశారు.