Begin typing your search above and press return to search.

బాబు బనకచర్ల మీద కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందా ?

ఏపీలో అధికారలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ని తెర ముందుకు తెచ్చారు.

By:  Satya P   |   29 July 2025 9:27 AM IST
బాబు బనకచర్ల మీద కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందా ?
X

ఏపీలో అధికారలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ని తెర ముందుకు తెచ్చారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని ఆయన పదే పదే చెబుతున్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు తో ఏపీలో అన్ని పొలాలకూ సాగు నీరు అందుతుందని కూడా బాబు చెప్పి ఉన్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ నాలుగు జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశం కోసం ప్రత్యేకించి ఈ సాగునీటి ప్రాజెక్టుని ఆయన ముందుకు తెచ్చారు. దీని కోసం ఏకంగా 81 వేల కోట్ల రూపాయలను ఏదో విధంగా నిధులు సమకూర్చుకుని మరీ పూర్తి చేయడానికి పధక రచన చేస్తున్నారు.

ఆదిలోనే అవరోదాలు :

బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న బనకచర్ల విషయంలో ఆదిలోనే అనేక అవరోదాలు ఎదురవుతున్నాయి. ఏటా గోదావరి జలాలు సముద్రంలోకి మూడు వేల టీఎంసీలు కలుస్తున్నాయని ఆ వరద జలాలను ఒడిసి పెట్టుకోవడమే కాకుండా వాటిలో కేవలం రెండు వందల టీఎంసీలను తీసుకుంటే కనుక బనకచర్ల ద్వారా ఏపీకి తాగు సాగు నీరు పూర్తిగా అందుతుందని బాబు లెక్కలు చెబుతున్నారు. అంచనాలు కూడా ఆ విధంగానే వేశారు. అయితే ఆది నుంచి తెలంగాణా రాష్ట్రం దీనిని అభ్యంతరం చెబుతోంది.

ఢిల్లీ స్థాయిలో మీట్ అయినా :

ఇటీవలనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ సారథ్యంలో ఏపీ తెలంగాణా ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. అయితే బనకచర్ల మీద ఎలాంటి చర్చలు జరగలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బనకచర్ల మీద తెలంగాణా అభ్యంతరాలను అన్నింటికీ తగిన జవాబు చెప్పి ఒప్పించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచించింది. కానీ అలా జరగలేదని అంటున్నారు. మరో వైపు తమకు బనకచర్ల మీద అభ్యంతరాలు చాలానే ఉన్నయని తెలంగాణా సర్కార్ కేంద్రానికి చెబుతూ వచ్చింది.

కేంద్రం స్పష్టం ఇదేనా :

ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు విష్యంలో కేంద్రం ఒక స్పష్ట ఇచ్చింది. పార్లమెంట్ లోనే దీనిని జవాబు చెప్పింది. ఈ అంశం మీద రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమాధానం ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రబుత్వం చెప్పిందని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. అంతే కదు ప్రాజెక్టు ప్రారంభించలేదని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాజ్యసభలో సమాధానం చెప్పడం విశేషం.

బనకచర్ల సంగతేంటి :

ఏపీ ప్రభుత్వం ఎంతో ఆశగా మరెంతో పట్టుదలగా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదని చెబుతూ తెలంగాణా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని కేంద్రం అంటోంది. అంతే కాదు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర గోదావరి పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పడం విశేషం. అంటే తెలంగాణా కంటే కూడా ఎగువన ఉన్న రాష్ట్రాలు అన్న మాట. అలా అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని కేంద్రం కీలక విషయాలనే పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.

కేంద్రం అనుమతులు ఇవ్వలేదా :

అంతే కాదు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కూడా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కూడా లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి అందచేసిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే బనకచర్ల విషయం ఇంకా చాలానే ఉందని అంటున్నారు. నికర జలాలు మిగులు జలాలతో పాటు వరద జలలాలో వాటా కూడా తేలాలని తెలంగాణా అంటోంది. ఎగువ రాష్ట్రాలు కూడా అదే అంటే కనుక బనకచర్ల ఇప్పట్లో తేలుతుందా అన్న చర్చ మొదలైంది. మొత్తం మీద చూస్తే ఈ ప్రాజెక్ట్ సంగతి ఏమి అవుతుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.