Begin typing your search above and press return to search.

'ఉమెన్ ఫైర్‌బ్రాండ్లు' ఓకే.. కానీ.. ఇది త‌ప్ప‌నిస‌రి...!

రాజ‌కీయాల్లో ఉన్న వారు ప్ర‌త్యేక గుర్తింపును కోరుకోవ‌డం కొత్త‌కాదు. కొంద‌రు సైలెంటుగానే ముందుకు సాగుతున్నారు.

By:  Garuda Media   |   9 Feb 2026 6:00 PM IST
ఉమెన్ ఫైర్‌బ్రాండ్లు ఓకే.. కానీ.. ఇది త‌ప్ప‌నిస‌రి...!
X

రాజ‌కీయాల్లో ఉన్న వారు ప్ర‌త్యేక గుర్తింపును కోరుకోవ‌డం కొత్త‌కాదు. కొంద‌రు సైలెంటుగానే ముందుకు సాగుతున్నారు. ఈ సైలెంట్‌లోనే గుర్తింపు కోరుకుంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం మాట‌ల తూటాలు పేల్చ‌డం ద్వారా త‌మ గుర్తింపు పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో మ‌హిళా నాయ‌కులు సైతం ప్ర‌త్యేక గుర్తింపును కొరుకుంటున్నారు. ఇది ఆది నుంచి ఉన్న‌దే. గ‌తంలో స్పీక‌ర్‌గా ప‌నిచేసిన ప్ర‌తిభా భార‌తి కూడా.. త‌న‌దైన శైలిలో గుర్తింపు కోరుకున్నారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. కూడా శకుంత‌ల‌మ్మ, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, వంగా గీత వంటివారు ఏదో ఒక రూపంలో గుర్తింపు తెచ్చుకున్నారు. మాట తీరుతో కొంద‌రు ప‌నితీరుతో మ‌రికొంద‌రు త‌మ ప్ర‌భావం చూపించారు. ప్ర‌త్యేకంగా నిలిచారు. ఇక‌, ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ మ‌హిళా నాయ‌కుల్లో మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, మాజీ మంత్రి రోజా, మాజీ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ వంటి వారు కూడా ఈ జాబితాలో చేరిపోయా రు. పైన చెప్పుకొన్న‌ట్టుగానే.. కొంద‌రు వివాదాల‌కు కేంద్రంగా మారారు.

ఇది లావుంటే.. ప్ర‌స్తుత ఎమ్మెల్యేల్లో గ‌ళ్లా మాధ‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇటీవ‌ల అంబ‌టి రాంబా బు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆయ న ఇంటిపైకి నిర‌స‌న కూడా వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో గ‌తంలో జ‌రిగిన మ‌హానాడులో కావ‌లి గ్రీష్మ సైతం.. తొడ గొట్టి మ‌రీ వైసీపీ నాయ‌కులకు హెచ్చ‌రిక‌లు చేశారు. ఇక‌, ఇత‌ర మ‌హిళా నేత‌ల విష‌యానికి వ‌స్తే.. క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వి రెడ్డి, ఆళ్ల గ‌డ్డ స‌భ్యురాలు.. భూమా అఖిల ప్రియ వంటివారు నిత్యం మీడియాలోనే ఉన్నారు.

అయితే.. ఇక్క‌డే వారు కొన్ని కొన్ని త‌ప్పులు, పొర‌పాట్లు కూడా చేస్తున్నారు. దూకుడు మంచిదే అయినా.. అది పార్టీకి ఇబ్బంది క‌లిగించేలా ఉండ‌కూడ‌దు. గ‌తంలో న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి విష‌యాన్ని తీసుకుంటే.. ఆమె ఫైర్ బ్రాండే. కానీ, ఎక్క‌డా దారి త‌ప్ప‌లేదు. పార్టీ మ‌ళ్లీ స్పందించి.. ఆమెను స‌రిదిద్దే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. అదేవిధంగా అనిత వ్య‌వ‌హారం కూడా అంతే. ఎక్క‌డా అనిత కూడా త‌న పంథాను వివాదం చేసుకోలేదు. కానీ, ఇప్పుడు కొంద‌రు మహిళా ఫైర్ బ్రాండ్లు మాత్రం కొంత దారి త‌ప్పుతున్నారు. దీంతో పార్టీ వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ విష‌యంలో ఒకింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.