Begin typing your search above and press return to search.

బాలయ్య జూనియర్ ఒక్కటి కాబోతున్నారా ?

రాజకీయాలు సినీ రంగం ఈ రెండూ అత్యంత ప్రజాదరణ ఉన్న రంగాలు. ఈ రెండు రంగాలలో రాణీంచాలంటే కనుక కచ్చితంగా ప్రజాదరణ నూరు శాతం ఉండాల్సిందే.

By:  Satya P   |   7 Oct 2025 9:00 PM IST
బాలయ్య జూనియర్ ఒక్కటి కాబోతున్నారా ?
X

రాజకీయాలు సినీ రంగం ఈ రెండూ అత్యంత ప్రజాదరణ ఉన్న రంగాలు. ఈ రెండు రంగాలలో రాణీంచాలంటే కనుక కచ్చితంగా ప్రజాదరణ నూరు శాతం ఉండాల్సిందే. ప్రజల దీవెనలు ఉంటేనే వెండి తెర హీరోలు అయినా రియల్ లైఫ్ లో పొలిటికల్ హీరోలు అయినా అవుతారు. ఇక టాలీవుడ్ లో ఎందరో హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాణించారు. అయితే సీఎం అయింది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఆయన వంశం నుంచి మళ్ళీ ఆ స్థాయిలో ఎవరూ సత్తా చాటుకోలేకపోయారు అన్నది వాస్తవం.

నారా నందమూరి బంధం :

ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టీడీపీని లీడ్ చేస్తూ వచ్చారు ఆయన నాలుగు సార్లు సీఎం అయ్యారు. టీడీపీలో చూస్తే తరువాత ఎవరు సీఎం అవుతారు అంటే నారా లోకేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక నారా వారికి నందమూరి బంధం కూడా తోడు అయింది. బాలయ్య తన బావ చంద్రబాబుకు పూర్తి మద్దతు కొనసాగిస్తూ వచ్చారు 1995 నుంచి ఈ రోజు దాకా గత మూడు దశాబ్దాలుగా ఏనాడూ ఆయన బావ మాట జవదాటలేదు. బావ సీఎం అయితే చాలు అనుకున్నారు. ఆ తరువాత తన మేనల్లుడు లోకేష్ ని మంత్రిగా చూసి దీవించారు. అయితే బాలయ్య కనీసం మంత్రి కూడా కాలేదన్నది ఆయన అభిమానులలో అయితే ఎంతో బాధగా ఉంది అని అంటారు.

అవమానమే అంటూ :

బాలయ్య అసెంబ్లీలో తాజాగా చేసిన వ్యాఖ్యల మీద అభిమానులు అయితే తప్పు పట్టడం లేదు. సైకో అన్నది బాలయ్య మొదటిసారి అనలేదు కదా అంతకు ముందు ఎందరో వందలాది సార్లు అన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. ఇక తన ప్రసంగంలో బాలయ్య చిరంజీవి పేరు కూడా ఎత్తలేదని ఎవడూ గట్టిగా అడగలేదు అని మాత్రమే అన్నారు అని గుర్తు చేస్తున్నారు. జగన్ మనస్తత్వం చెప్పే ఉద్దేశ్యంతోనే ఆయన అలా గట్టిగా చెప్పారు తప్పించి మెగాస్టార్ గురించి ఏమీ అనలేదని అంటున్నారు. అయినా సరే బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క త్రాటి పైకి ఫ్యాన్స్ :

ఇదిలా ఉండగా టీడీపీకి అనుకూలంగా చెప్పబడే ఒక బడా చానల్ తన వారాంతం విశ్లేషణలో బాలయ్య మీద దారుణంగా రాసిందని ఆయనే అంతటికీ కారణం అంటూ దోషిగా ముందు పెట్టిందని ఆయన ఫ్యాన్స్ రగులుతున్నారు. కూల్ గా మారుతున్న వాతావరణాన్ని మళ్ళీ కెలకడం బాలయ్యనే పాయింట్ అవుట్ చేయడం వెనక ఉద్దేశ్యాలు ఏమిటి అని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. టీడీపీలో నందమూరి వారు ఉండకూడదని ఇదంతా చేస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

బాబాయ్ అబ్బాయ్ కలవాలి :

ఇపుడు సోషల్ మీడియాలో కొత్త నినాదం వినిపిస్తోంది బాబాయ్ అబ్బాయ్ కలవాలని వారు కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పై స్థాయిలో బాలయ్య ఎన్టీఆర్ ల మధ్య విభేదాలు ఉండొచ్చేమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి సినిమాలూ చూస్తూ వస్తున్నారు. ఇద్దరినీ అభిమానిస్తున్నారు. ఇపుడు టీడీపీలో నందమూరి వారి మీద విమర్శలు రావడం ఒక చానల్ అయితే బాలయ్యనే టార్గెట్ చేయడంతో ఇక లాభం లేదని ఇద్దరూ కలవాల్సిందే అంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే సదరు చానల్ కెలికి నందమూరి ఫ్యాన్స్ ని ఒక్కటిగా గట్టిగా చేశారు అని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుతున్నట్లుగా బాబాయ్ అబ్బాయ్ కలుస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్న.

అగ్రహంగా బాలయ్య

అయితే బాలయ్య మాత్రం తాజా పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు అని అంటున్నారు. తాను ఏ అధికారం కోరుకోకుండా తన తండ్రి పార్టీ మీద అభిమానంతో పూర్తిగా సపోర్టు చేస్తూ ఉంటే ఆఖరికి తన మీద ఈ విధంగా విమర్శలు రావడం తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా కధనాలు వస్తూంటే తనకు కనీస మద్దతు కూడా దక్కకపోవడం పట్ల తీవ్రంగా మధన పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఒక దశలో బాలయ్య కూడా మెగాస్టార్ రాసిన దాని మీద ఒక బహిరంగ లేఖ రాయాలని చూశారని దానికి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆపాల్సి వచ్చింది అని అంటున్నారు ఆ లేఖలో తాను ఏ సందర్భంలో అలా మాట్లాడాను అని ఆయన వివరించే ప్రయత్నం చేయాలనుకున్నారుట. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య మాత్రం టీడీపీ అధినాయకత్వం వైఖరి మీద గుస్సాగా ఉన్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య జూనియర్ ఒక్కటి కావడానికి ఇదే సరైన సమయం అని అలా కలసి ఉంటేనే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అంటున్నారు. మరి ఈ ప్రచారం ఈ ఆలోచనలలో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది.