Begin typing your search above and press return to search.

బాలయ్య బాధ్యత తీసుకున్నారా ?

ఇది నిజానికి సినిమా ప్రారంభోత్సవం తో పాటు ఏపీ వైపు సినీ కెమెరా ఫోకస్ పెట్టడం మరోసారి సరికొత్తగా స్టార్ట్ చేసింది అని చెప్పడం కూడా సబబు అని అంటున్నారు.

By:  Satya P   |   26 Jun 2026 12:11 AM IST
బాలయ్య బాధ్యత తీసుకున్నారా ?
X

నందమూరి బాలకృష్ణ అయిదు దశాబ్దాల సినీ చరిత్ర కలిగిన వారు. ఆయన ఈ రోజుకీ వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. హిట్లూ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. ఇక తాజాగా బాలయ్య కొత్త సినిమా అమరావతిలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొత్త సినిమా ప్రారంభం అయింది. ఇది నిజానికి సినిమా ప్రారంభోత్సవం తో పాటు ఏపీ వైపు సినీ కెమెరా ఫోకస్ పెట్టడం మరోసారి సరికొత్తగా స్టార్ట్ చేసింది అని చెప్పడం కూడా సబబు అని అంటున్నారు.

ఏపీ సినీ కేంద్రంగా :

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత సినీ కళ కొంత తగ్గింది అన్న చర్చ అయితే ఉంది. దాని మీద అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. నిజానికి ఏపీకి సినీ సీమకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో సినిమా షూటింగులు ఏపీలోనే గతంలో జరిగాయి. ఏపీలో గోదావరి అందాలు లేకుండా గతంలో ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న దాఖలాలు కూడా లేవు. మరో వైపు చూస్తే ఏపీలో అద్భుతమైన అందాలు సెల్యూలాయిడ్ మీద మరింత అందంగా మెరిగి ఆయా సినిమాలకు కనక వర్షం కురిసింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం సినిమాలు ఎక్కువగా విదేశాలలో షూటింగులు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. పాన్ ఇండియా మూవీస్ కూడా ఎక్కువగా తీస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమాను ఏపీకి తిరిగి తీసుకుని రావాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని స్పష్టం అవుతోంది.

వినోద రంగం కీలకం :

వినోద రంగం ఇపుడు కీలకంగా మారుతోంది. అది కూడా ఇతర పరిశ్రమల మాదిరిగా ఉపాధితో పాటు ప్రభుత్వాలకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఈ నేపధ్యంలో అమరావతిని తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నాలు చేస్తోంది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి వినోద రంగం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన షూటింగ్‌లు ప్రారంభోత్సవ కార్యక్రమాల ద్వారా కొన్ని ముఖ్య భాగాల రాకతో ఏపీ కళకళలాడుతుంది. చిత్ర పరిశ్రమ ఆదాయానికి ఆంధ్రప్రదేశ్ అందించిన సహకారానికి ప్రతిఫలంగా ఏపీలోనూ చిత్ర సీమ ప్రగతికి దారులు వెతికే క్రమంలోనే యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు.

బాలయ్య అడుగులు :

బాలకృష్ణ సినీ హీరో మాత్రమే కాదు, హిందూపురం నుంచి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే. ప్రభుత్వంలో ఆయన కూడా కీలకమే అని చెప్పాలి. ఇపుడు బాలయ్య తన నూతన చిత్రం ప్రారంభోత్సవం అమరావతిలో ప్రారంభించడం ద్వారా కొంత కలయికను అయితే తీసుకుని రాగలిగారు. ఇక ఈ సినిమాను అధిక భాగం ఏపీలోనే చిత్రీకరిస్తారు అని చెబుతున్నారు. తద్వారా మరోసారి ఏపీ సెల్యూలాయిడ్ మీద తన సొగసులను ప్రదర్శించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే పంధాలో మరిన్ని చిత్రాలు ఏపీలో షూటింగులు జరుపుకునేందుకు రాచబాట వేయడానికి రంగం సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. దాంతో ఫిల్మ్ మేకర్స్ గతంలో మాదిరిగా ఏపీలో విరివిగా షూటింగులు చేస్తే కనుక విభజన ఏపీ చిత్ర సీమ కాంతులతో కళకళలాడడం ఖాయమని అంటున్నారు.