బాలయ్య రాజకీయం...హిందూపురం !
నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2014 నుంచి అక్కడ పాగా వేశారు. తండ్రి తరువాత అదే సీట్లో మొత్తం మూడు పర్యాయాలు గెలిచి ఆ రికార్డుని సమం చేశారు.
By: Satya P | 1 Oct 2025 4:00 AM ISTనందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2014 నుంచి అక్కడ పాగా వేశారు. తండ్రి తరువాత అదే సీట్లో మొత్తం మూడు పర్యాయాలు గెలిచి ఆ రికార్డుని సమం చేశారు. జగన్ ప్రభంజనం బలంగా వీస్తున్న 2019 ఎన్నికల్లో కూడా అనంతపురం జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలిస్తే అందులో ఒకటి బాలయ్యది కావడం విశేషం. ఆ విధంగా ఆయన హిందూపురం జనం మనసు గెలుచుకున్నారు. నందమూరిపురంగా దానిని మార్చేశారు. అక్కడ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన చేపడుతూ వస్తున్నారు.
ఎక్కడ నుంచి అయినా :
ఆ మధ్య బాలయ్య అమరావతిలో బసవతారకం ఆసుపత్రి శంకుస్థాపన జరిగిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను హిందూపురానికే పరిమితం కానని ఎక్కడ నుంచి అయినా పోటీ చేసే సత్తా తనకు ఉందని అన్నారు. ఏపీ తెలంగాణాలో ఎక్కడైనా తన అభిమానులు ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆనాడు బాలయ్య చాలా క్యాజువల్ గా ఈ వ్యాఖ్యలు చేసినా దాని మీద ఆనాడే చర్చ సాగింది. వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురాన్ని విడిచిపెడతారు అని కూడా విశ్లేషణలు చేసిన వారూ ఉన్నారు. ఆయన వదిలేసే హిందూపురం సీట్లో ఆయన సతీమణి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం అపుడే స్టార్ట్ చేశారు.
ఎమ్మెల్యేగానే ఉంటూ :
ఇక బాలయ్య మొత్తం మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందులో ఒకసారి మాత్రమే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు రెండు సార్లు అధికారంలో టీడీపీ ఉన్నా బాలయ్యకు కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు. దాంతో ఆయన సంగతి ఎలా ఉన్నా అభిమానులు మాత్రం బాగా ఫీల్ అయ్యారు. ఇక చూస్తే కనుక గతంలోనూ ఇపుడు కూడా మంత్రులుగా చాలా మంది అయ్యారు. ఒక్కసారి గెలిచిన వారు కూడా మంత్రిగా మంచి పొజిషన్ లో ఉన్నారు. బాలయ్యకు మాత్రం ఆ చాన్స్ అయితే దక్కలేదు అన్న ఆవేదన అయితే అభిమానులలో ఉంది.
అది ఒక కారణంగా :
బహుశా బాలయ్యలో కూడా ఇది ఒకటి ఆవేదన ఉండే ఉంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. ఇక సినీ రంగంలో చూస్తే ఒక రకమైన పోటీ వాతావరణం ఉంది. అక్కడ సినిమాల పరంగా ఢీ అంటే ఢీ కొట్టే విధంగా ఉంటుంది. అయితే రాజకీయంగా చూస్తే బాలయ్య జస్ట్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు అని ఆయనను అభిమానించేవారు అనుకునే సందర్భాలు ఉన్నాయని అంటారు. ఇక బాలయ్యతో పాటే సినీ రంగం నుంచి వచ్చిన వారు రాజకీయంగా కీలక పదవులు చేపడుతున్నారు అన్నది కూడా ఫ్యాన్స్ నుంచి అయితే పోలిక వస్తూనే ఉంది. ఇవన్నీ కలసి ఒక విధంగా అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. అయితే ఈ తరహా వ్యాఖ్యల వల్ల బాలయ్యకు రాజకీయంగా లాభం ఏమీ లేకపోగా నష్టమే ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు.
ఈసారి అక్కడ నుంచి :
బాలయ్య హిందూపురం నుంచి 2029లో పోటీ చేస్తారా అన్నది ఇపుడు జరుగుతున్న మరో చర్చగా ఉంది. ఆయన నిజానికి 2024 ఎన్నికల్లోనే పార్లమెంట్ కి చేస్తారు అని అంతటా ప్రచారం సాగింది. అయితే చివరికి హిందూపురం నుంచి పోటీ చేశారు. కానీ వచ్చే ఎన్నికల మీద ఇప్పటి నుంచే చర్చలు సాగుతున్నాయి. బాలయ్య పోటీ చేస్తారా అలా జరుగుతుందా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. బాలయ్య రాజకీయం చూస్తే ఆయనకు అంత సంతృప్తిగా లేదని అంటున్నారు. అలాగే టీడీపీకి కూడా అదే విధంగా ఉందా అన్నది కూడా ఉంది.
టీడీపీలో నందమూరి బంధం :
మరి బాలయ్య కనుక పోటీ చేయకపోతే టీడీపీలో నందమూరి బంధం అన్నది ఏమవుతుంది అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఆయనే టీడీపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవన్నీ ఇపుడే ఎందుకు చర్చకు వస్తున్నాయంటే బాలయ్య అసెంబ్లీలో వ్యాఖ్యల మీద చాలానే సాగుతోంది. ఒక విధంగా అధినాయకత్వం నుంచి పార్టీ నుంచి ఆయనకు పెద్దగా మద్దతు దక్కడంలేదు. ఇక ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయంలో బాలయ్య వ్యాఖ్యల ప్రభావం చాలానే ఉంటుంది అని అంటున్నారు. దాంతోనే ఫ్యూచర్ పాలిటిక్స్ మీద సైతం చర్చ సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
