Begin typing your search above and press return to search.

బాలయ్యకు ఎదురెళ్తామంటున్న వైసీపీ !

ఇక బాలయ్య తాను ఎక్కువ సమయం గడపకపోయినా అభివృద్ధి విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.

By:  Satya P   |   14 Sept 2026 9:08 AM IST
బాలయ్యకు ఎదురెళ్తామంటున్న వైసీపీ !
X

బాలయ్యకు ఎవరు ఎదురెళ్ళినా వారికే రిస్క్. అలాగే ఆయన ఎదురొచ్చినా కూడా రిస్కే. ఇది పాపులర్ సినీ డైలాగ్. కానీ హిందూపురం పాలిటిక్స్ లో రియల్ లైఫ్ లో కూడా బాలయ్య ప్రయ్తర్ధులకు అదే సందేశం వినిపిస్తున్నారు. ఒక్కసారి కాదు వరసగా మూడు సార్లు అక్కడ గెలిచి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ ఏపీ మొత్తం 23 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు సీట్లు మాత్రమే గెలిస్తే అందులో బాలయ్య హిందూపురం ఒకటి. ఇక బాలయ్య 2014లో గెలిచిన దాని కంటే కూడా 2019లో మెజారిటీ భారీగా పెరిగింది. అలాగే 2024లో అంతకు మించి పెరిగింది. ఇలా ఎన్నిక ఎన్నికకూ తన మెజారిటీని పెంచుకుని పోతున్న బాలయ్య హిందూపురం కాస్తా నందమూరిపురంగా మార్చేశారు. అక్కడ ఆయన్ని సైడ్ చేయడం అంటే వైసీపీకి కష్టసాధ్యమే అని అంటున్నారు.

తొడగొట్టి మరీ :

ఇక బాలయ్య తాను ఎక్కువ సమయం గడపకపోయినా అభివృద్ధి విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. పైగా నిధులు కూడా దండీగా తెచ్చి ఖర్చు చేస్తున్నారు. దాంతో హిందూపురం జనాలు అయితే టీడీపీ పట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఓడిపోలేదు. ఆ పార్టీ పుట్టాక ఇప్పటికి వరకూ పది ఎన్నికలు జరిగితే అన్ని ఎన్నికలను టీడీపీ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బాలయ్య మరో మూడు సార్లు గెలిచారు. హరిక్రిష్ణ ఒకసారి గెలిచారు. మిగిలిన మూడు సార్లు నందమూరి ఫ్యామిలీకి చెందని వారు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంత స్ట్రాంగ్ బేస్ ఉన్న హిందూపురంలో స్థానిక ఎన్నికలలో తమ సత్తా చాటుతామని వైసీపీ బిగ్ సౌండ్ చేస్తోంది.

సాధ్యమయ్యేదేనా :

హిందూపురం మునిసిపాలిటీని 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. అపుడు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సాధ్యపడింది. అయితే ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తామని అంటోంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా అని సొంత పార్టీలోనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కంచుకోట ప్లస్ బాలయ్య ఇమేజ్ ప్లస్ అభివృద్ధి ప్లస్ కూటమిలో పొత్తులు ఇవన్నీ కలసు అయ్తంత పటిష్టంగా అవతల వైపు ఉంటే వైసీపీ ఈసారి హిందూపురాన్ని గెలుస్తామని చెప్పడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు, బాలయ్య సొంత నియోజకవర్గంలోనే అది కూడా గుండె కాయ లాంటి హిందూపురం మునిసిపాలిటీనే గెలిచి తామేంటో చూపిస్తామని అంటున్నారు.

వర్గ పోరు సంగతేంటి :

ఇదిలా ఉంటే హిందూపురంలో వర్గ పోరు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే అంటున్నారు. ఆ పార్టీలో ముగ్గురు నాయకులు మూడు వర్గాలుగా వైసీపీ రాజకీయం నిన్నటిదాకా సాగింది. దాంతో వైసీపీ హిందూపురం ఇంచార్జి కురుబ దీపికని వ్యతిరేకిస్తున్నారు అన్న కారణంతో నవీన్ నిశ్చల్ ని అలాగే వేణుగోపాల్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆ ఇద్దరు నేతలు వారి అనుచరులు పూర్తిగా పార్టీలో మౌన ముద్ర దాల్చారు అని అంటున్నారు. ఇక ఇపుడు దీపిక మాత్రమే ఒంటి చేత్తో పార్టీని నెట్టుకుని వస్తున్నారు. అంతా కలసి ఉంటే వైసీపీ బలంగా ఉండేదే కానీ వర్గ పోరుతోనే సగం ఓటమి కొని తెచ్చుకుంటోంది అని అంటున్నారు. టీడీపీ విజయాలకు వైసీపీ వర్గ పోరు కూడా కారణం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో మునిసిపల్ ఎన్నికల్లో గెలిచేస్తామని వైసీపీ చెబుతూండడం పట్ల చర్చ సాగుతోంది. నిజంగానే టీడీపీ కంచుకోటలో ఫ్యాన్ జోరు సాగితే మాత్రం అది అద్భుతమే అవుతుంది అని అంటున్నారు.